పెద్దల అహంకారానికి చిన్నారులు బలి అవుతున్నారు

చిన్నారులతో ఫ్రాన్సిస్ పాపు గారుపోప్ ఫ్రాన్సిస్

పెద్దల అహంకారానికి చిన్నారులు బలి అవుతున్నారు

 

విశ్వాసులకు సందేశం ఇచ్చే ముందు ఫ్రాన్సిస్ పాపు గారు ఇటలీ లోని చిన్నారులను కలిశారు. ఈ చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండా సెయింట్ పీటర్స్ బాసిలికాకు వచ్చినందుకు వారికి అందరికంటే అత్యున్నత గురువు రూపంలో ఫ్రాన్సిస్ పాపు గారు ఉపదేశం ఇచ్చారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ లోని చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పాపు గారు వారితో మాట్లాడారు. "మీరు ఖచ్చితంగా శాంతియుత సమాజంలో ఎదగగలిగే భవిష్యత్తు మీ ముందు ఉంది. కానీ ఉక్రెయిన్ లోని చిన్నారులు ఎంతో కాస్త పరిస్థితులలో ఉన్నారు. వారు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పటికీ, బాంబుల నుండి పారిపోవాలి. నేడు చలికి తల్లడిల్లిపోతున్నారు"అని పాపు గారు అన్నారు. ఆయన మాటలను వారి హృదయాలలో ఉంచుకోవాలని పాపు గారు కోరారు.

ఓ క్రీస్తు ప్రభువా  ఉక్రెయిన్ లోని ఆ చిన్నారులను జ్ఞప్తియందు ఉంచుకొనండి, అక్కడి యువకులను జ్ఞాపకం చేసుకోండి. వారిని కాపాడండి. పెద్దల అహంకారానికి చిన్నారులు బలి అవుతున్నారు. అని పాపు గారు ప్రార్ధించారు.

రోజువారీ అనుభవాలకు మించి దేవునితో అనుబంధాన్ని వర్ణించడానికి పాపు గారు ఉపయోగించే మాటలు "ఆశ్చర్యము మరియు కృతజ్ఞత" అను మాటలే ఈ చిన్నారులతో జరిగిన సమావేశానికి ముఖ్య ఉద్దేశాలని పాపు గారు అన్నారు.

Add new comment

6 + 0 =