పునీత ఫ్రాన్సిస్ శౌరి వారిని ఆదర్శంగా తీసుకుందాం - పొప్ ఫ్రాన్సిస్ గారు

పునీత ఫ్రాన్సిస్ శౌరి వారిని ఆదర్శంగా తీసుకుందాం - పొప్ ఫ్రాన్సిస్ గారు

బుధవారం జనరల్ ఆడియన్స్ తో సమావేశం సందర్భంగా, జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారు ఎక్కడ ఉన్న విశ్వాసులతో ముచ్చటించారు. గత కొన్ని నెలలుగా "సువార్తికరణ కొరకు తపన" అనే అంశంపై ప్రసంగిస్తున్న పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ అంశం మీదే తన సందేశాన్ని కొనసాగించారు.

ఈ సందర్భముగా పొప్ ఫ్రాన్సిస్ గారు పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి విశ్వాసాన్ని, సువార్తను వ్యాప్తి చేయటంలో ఆయన పోషించిన పాత్రను విశ్వాసులకు వివరించారు.

ఆయన మాట్లాడుతూ! పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు, వినూత్న రీతిలో సువార్తను బోధించారు,చిన్న బిడ్డలకు, పెద్దలకు, అక్షర జ్ఞానం లేని వారికి సైతం ఆయన ప్రసంగాలు సులభంగా అర్థమయ్యాయి, ఒకవైపు సువార్తికరణ కొరకు తపన పడుతూనే, మరోవైపు వ్యాధిగ్రస్తులకు సేవ చేసేవారని వారి నుండి మనం ఎన్నో అమూల్యమైన విషయాలను మనము నేర్చుకోవచ్చునని అన్నారు.

Add new comment

3 + 6 =