పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడండి - పోప్ ఫ్రాన్సిస్ గారు

పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడండి - పోప్ ఫ్రాన్సిస్ గారు

మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు, వాటికన్ వేదికగా పుణ్యక్షేత్ర రెక్టర్లుగా సేవలందిస్తున్న దైవాంకితులతో సమావేశమయ్యారు.ఈ సందర్భముగా  వారితో పలు కీలక విషయాలు చర్చించారు .

మహా పూజ్య  పోప్ ఫ్రాన్సిస్ గారు మాట్లాడుతూ "పుణ్యక్షేత్రాలు  దైవ ప్రజలందరినీ ఒకచోట చేర్చే దైవ నిలయాలని వాటి పవిత్రతను మనమందరము కాపాడాలని , భక్తి తో ఆ దేవుని సన్నిధికి వచ్చే సందర్శకులను, విశ్వాసులను ప్రేమతో ఆహ్వానిస్తూ, వారిని శ్రీసభ బిడ్డలుగా చేర్చి, శ్రీ సభ సప్త సంస్కారాలలో భాగం కల్పించాలని ఆయన కోరారు.

విశ్వాసులు ఎన్నో భారాలతో,బాధలతో,వివిధ అవసరాలతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారని వారిని సాదరంగా ఆహ్వానిస్తూ,వారి కొరకు ప్రార్థించాలని ఆయన రెక్టర్లను కోరారు.ముఖ్యంగా పాప సంకీర్తన సంస్కారము యొక్క గొప్పతనాన్ని గూర్చి విశ్వాసులకు తెలియపరుస్తూ, వారిని ప్రోత్సాహించాలని,ముఖ్యంగా గురువులు పాప సంకీర్తనలు వినే విషయంలో శ్రద్ధ వహిస్తూ, ఎల్లప్పుడూ విశ్వాసులకు అందుబాటులో ఉండాలని ఆయన పోప్ ఫ్రాన్సిస్ గారు కోరారు.

Add new comment

12 + 0 =