పుకార్లు... "లక్ష్యోద్దేశపూరిత కాన్సర్ " అని అభిప్రాయపడ్డ ఫ్రాన్సిస్ పాపు గారు

what is gossip?Pope francis

పుకార్లు... "లక్ష్యోద్దేశపూరిత కాన్సర్ " అని అభిప్రాయపడ్డ ఫ్రాన్సిస్ పాపు గారు.

బుధవారం 20 సెప్టెంబర్ 2019న తన సామాన్య సందర్శన లో ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసులను కలిశారు. తన సందేశాన్ని అపోస్తులుల కార్యాలను ధ్యానించడం తో కొనసాగించారు. ఆది క్రైస్తవ సంఘం ఎటువంటి కష్టాలను ఎదుర్కొందో ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పుకార్లు అనేవి ఒక మంచి సమాజానికి పట్టిన చీడ పురుగు వంటిది అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆది క్రైస్తవ సంఘం లోని అంతర్గతంగా ఉన్న పుకార్లు పెద్దవై బయట సంఘాలకు కూడా విస్తరించడం ప్రారంభించాయి అని పాపు గారు  వివరించారు.

పునీత స్టీఫెన్ గారిని ఉదాహరణగా పాపు గారు చూపించారు. స్టీఫెన్ గారిపై నేరుగా దాడి చెయ్యలేక ఆయన శత్రువులు ఆయన మీద పుకార్లు వ్యాపింపచేసారు అని ఆయన గుర్తు చేసారు.

"అపవాదు లేదా పుకారు తప్పుడు సాక్ష్యం వంటిది. అది మరణానికే దారి తీస్తుంది. ఇది ఒక "లక్ష్యోద్దేశపూరిత కాన్సర్"వంటిది. ఒకరి కీర్తిని పలుకుబడిని దెబ్బ తీసి తత్ఫలితంగా వారి జీవితాన్ని హరించాలి అనే కుటిల ఆలోచన నుండి ఇది ఉద్భవిస్తుంది"అని పాపు గారు అన్నారు.

నేటి క్రైస్తవ సంఘం తమ విశ్వాసం కోసం ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న స్త్రీ పురుషులతో నిండి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

డేనియల్  డియాజ్  విజ్య్
అనువాదకర్త: బండి అరవింద్

Add new comment

7 + 8 =