పిల్లలను, వృద్ధుల దగ్గరికి తీసుకురండి - పోప్ ఫ్రాన్సిస్ 

వృద్ధుల పోప్ ఫ్రాన్సిస్

"మీ తండ్రిని మరియు మీ తల్లిని గౌరవించండి” అనే ఆజ్ఞ కుటుంబానికి మాత్రమే కాకుండా, వృద్ధులను గౌరవించడానికి కూడా వర్తిస్తుందని ఫ్రాన్సిస్ పాపు గారు బుధవారం ప్రజలకు ఇచ్చిన తన సందేశంలో అన్నారు. 

విశ్వాసులకు సత్యోపదేశ సందేశంలో భాగంగా ఆయన ఈ విషయాన్ని వివరించారు. వృద్ధుల విలువను విస్మరించే నేటి యువత యొక్క సంస్కృతిపై ఆయన తన నిరాశను వ్యక్తం చేసారు. ఇటీవల ఇటలీలో ఒక నిరాశ్రయుడైన వృద్ధుని దుప్పటికి నిప్పుపెట్టిన పిల్లల ఉదాహరణను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 

తల్లిదండ్రులు తమ పిల్లలను వృద్దాప్య సంస్కృతిని ఎదుర్కోవడానికి వారి జీవితంలోని వృద్ధులకు దగ్గరగా తీసుకురావాలని కోరారు పాపు గారు అన్నారు.

దయచేసి మీ పిల్లలను, వృద్ధుల దగ్గరికి తీసుకురండి, వారిని ఎల్లప్పుడూ వృద్ధులకు దగ్గరగా ఉంచండి మరియు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేదా సరిగ్గా ఆలోచించలేనప్పుడు, వారిని దగ్గరకు తీసుకోండి, తద్వారా వీరు మన స్వంత వారు అని వారు తెలుసుకుంటారు కనుక దయచేసి వృద్ధులను దూరంగా ఉంచవద్దు. 

పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో చేరిన వివిధ యాత్రికుల సమూహాలను అభినందించారు మరియు ఉక్రేనియన్ శరణార్థులను వారి ఇళ్లలోకి స్వాగతించినందుకు పోలాండ్ నుండి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
 

Add new comment

8 + 12 =