నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది

నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిదినీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు

నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది

ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసులకు తన సత్యోపదేశంలో చివరిగా  అష్టభాగ్యములలో  ఎనిమదవదైన " నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది" అను దానిని గూర్చి ధ్యానించారు.

అష్టభాగ్యాలను పాటిస్తూ జీవించే వారికైనా ఈ లోకం వల్ల శోధన ఉంటుందని, స్వర్గమందు ఆనందానికి వారే కారణమని, స్వార్ధ జీవితాన్ని విడిచి జీవించడానికి వీరి జీవితాలు ఆదర్శమని పాపు గారు అన్నారు.

నేటి సమాజంలో, సమాజం చేత  ఎందరో క్రైస్తవులు వారి విశ్వాసానికై శోధింపబడుతున్నారని, కానీ ప్రతి ఒక్క సూధన వారిని క్రీస్తు ప్రభునికి మరింత దగ్గరగా చేస్తుందని తద్వారా వారు కూడా స్వర్గానుభూతి పొందుతారని పాపు గారు వివరించారు.

పాపు గారి సందేసార్ధము (క్లుప్తంగా)

ప్రియ సహోదరి సహోదరులారా

మత్తయి 5 : 10 లో చెప్పబడిన  " నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు; పరలోక రాజ్యము వారిది" అను దానితో అష్టభాగ్యాలపై మన సత్యోపదేసం ముగుస్తుంది. అష్టభాగ్యాలలో క్రీస్తు చెప్పిన జీవన వైఖరి ప్రకారం ఆయన కోసం మనం జీవిస్తే, ఈ ప్రపంచం నుండి మనకు వ్యతిరేకత ఎదురౌతుంది కానీ ఈ వ్యతిరేకతే స్వర్గంలో ఆనందానికి కారకమౌతుంది.

అష్టభాగ్యాలను అనుసరించు జీవితం ఒక నూతన మార్గంలో నడుస్తుంది. అది స్వార్దభరితం నుండి ఆత్మ ప్రేరేపిత జీవితంగా పరిణామం చెందుతుంది. మనం దీనిని పునీతుల జీవితాలలో గమనించవచ్చు. వారికి ఈ ప్రపంచం నుండి ఎటువంటి వ్యతిరేకత ఎదురైనా వారు వెనక్కి తగ్గలేదు.

నేటి సమాజంలో కూడా ఎందరో సహోదరి సహోదరులు ఇప్పటికీ వ్యతిరేకతను ఎదుర్కోవడం ఎంతో బాధాకరం. వీరందరికి మన సంఘీభావాన్ని తెలియజేస్తున్నాను. మనము ఈ భూమికి ఉప్పు వాలే ఉండాలి, ఎప్పుడైతే మనం మన సారాన్ని కోల్పోతామో అప్పుడు ఇతరులు మన పట్ల ఏహ్య భావమును పొందుతారు. మనం ఎదుర్కొను కష్టాలన్నీ కూడా మనల్ని నూత్న జీవమునకు చేర్చు క్రీస్తునకు దగ్గరగా చేరుస్తాయి.

ఈ విధంగా అష్టభాగ్యాలను అనుసరిస్తూ సాత్విక జీవితాన్ని జీవిస్తే అమితానందకరమైన ఆ పరలోక రాజ్య అనుభూతి మనకు కలుగుతుంది.

ఉత్థాన క్రీస్తుని ఆనందంలో మీ పై మీకుటుంబాలపై ఆ ప్రేమామయుని యొక్క దయ ప్రోక్షింపబడాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్ము దీవించును గాక. 

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/04/29/pope-reflects-on-blessed-are-those-who-are-persecuted-for-righteousness-sake-in-general-audience/

Add new comment

1 + 9 =