నీతిగల వారి ప్రార్ధన గూర్చి ధ్యానించి ఫ్రాన్సిస్ పాపు గారు

prayer of the Justనోవాహు వంటి నీతి గలవారు ఎంతో విధేయతగా ప్రార్ధించారు

నీతిగల వారి ప్రార్ధన గూర్చి ధ్యానించి ఫ్రాన్సిస్ పాపు గారు.

ఫ్రాన్సిస్ పాపు గారు ప్రజలకు తన సత్యోపదేశ సందేశం ప్రార్ధన గురించి ఉంది. ముఖ్యంగా ఆదికాండము మొదటి అధ్యాయము నుండి విషయాలను ధ్యానించారు.

ఆదాము అవ్వలు పాపములో పడిపోవడం ఆబేలును కయీను చంపడం వంటి విషయాలు ధ్యానించారు.

వీరు పాపముల వెనుక కారణం మరియు ఆబేలు నోవాహు వంటి వారి మంచితనము వెనుక కారణాలను వివరించారు.

స్వస్థత ఎదుగుదల మరియు పరివర్తన కోసం తండ్రిని వేడుకొను వారి న్యాయయుక్తమైన ప్రార్ధనను మనందరం అనుకరించాలని పాపు గారు అన్నారు.

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

ప్రార్ధనను గూర్చిన మన సత్యోపదేశంలో న్యాయయుక్తమైన వారిని గూర్చి చర్చించుకుందాం.

ఆది కాండములో ఆదాము అవ్వ పాపములో పడిపోవడం కయీను చేత ఆబేలు చంపబడడం వంటి సంఘటనలు పాపము యొక్క ఆవిర్భావం మరియు తర తరాల నుండి పాపం పాకడం స్పష్టంగా కనిపిస్తుంది.

ఇప్పటికి కూడా ఈ ప్రపంచంలో దుష్టత్వంతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ తన బిడ్డల కోసం దేవుని చిత్తం మంచి కోసమే కానీ చెడుకోసం కాదు. ఆదికాండము మొదటిలో ఆబేలు , ఏనోకు మరియు నోవాహు వంటి నీతి గలవారు ఎంతో విధేయత గా ప్రార్ధించడం మనం చూస్తాం.

వీరి నీతియుక్తమైన ప్రార్ధన వలన వీరు హింస నుండి దూరంగా ఉండగలిగి దేవుని మార్గంలో నడువగలిగారు. చరిత్రలో మనం గమనించినట్లయితే నీతియుక్తమైన వారిని ప్రపంచం తప్పుగా అర్ధం చేసుకున్నా , వారు దానిని పట్టించుకోకుండా దేవుని దయ ఈ ప్రపంచం పైకి రావడానికి నిరంతరం ప్రార్ధించారు. వారి వాలే మనం కూడా ఈ ప్రపంచంలో పరివర్తన రావాలని ఆ తండ్రిని ప్రార్ధించడం నేర్చుకోవాలి.

పెంతుకోస్తు పండగకు దగ్గర  అవుతున్న ఈ తరుణంలో మీ పై మీ కుటుంబాలపై ఆ పవిత్రాత్మ దేవుని వరాలు ప్రోక్షింపబడాలని ప్రార్ధిస్తున్నాను.

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/05/27/pope-reflects-on-prayers-of-righteous-men-and-women/

Add new comment

1 + 0 =