నాటో కూటమిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పోప్ ఫ్రాన్సిస్ గారు

ఉక్రెయిన్‌‌పై రష్యా యుద్ధానికి నాటో కూటమే కారణమని పోప్‌ ఫ్రాన్సిస్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మద్దతు ఉన్న  నాటో కూటమిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన  పోప్ ఫ్రాన్సిస్ గారు. రష్యా గుమ్మం ముందు మొరగడమే ఈ దండయాత్రకు కారణమై ఉండొచ్చంటూ అభిప్రాయపడ్డారు. ఇటలీకి చెందిన కొరియరా డెల్లా సెరా మీడియాకు మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పోప్‌ ఈ విధంగా స్పందించారు.

ఉక్రెయిన్‌ విషయంలో రష్యా అనుసరిస్తున్న తీరుపై మాట్లాడుతూ "రష్యా సమీప దేశాల్లో నాటో ఉనికి పుతిన్‌ను రెచ్చగొట్టి ఉంటుంది. దాని ఫలితమే ఉక్రెయిన్‌పై ఈ దండయాత్ర అని అనుకుంటున్నా’’ అని అన్నారు.  ప్రస్తుతం ఉక్రెయిన్‌లో జరుగుతోన్న పరిణామాలను.. 20 వ శతాబ్దంలోనే అతిపెద్ద నరమేధంగా చరిత్రలో నిలిచిపోయిన రువాండా ఉదంతంతో పోల్చారు. 1990ల్లో రువాండాలో చోటుచేసుకున్న నరమేధం లో దాదాపు 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని పోప్ గుర్తుచేసుకున్నారు.

యుద్ధం గురించి  రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చించాలని భావిస్తున్నట్టు పోప్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇందుకోసం  రష్యా ను  సమయం కోరగా అటువైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. కీవ్‌పై దాడి ప్రారంభించిన 20 రోజుల తర్వాతే తాను పుతిన్‌కు సందేశం పంపానని వెల్లడించారు.  ఉక్రెయిన్‌లో శాంతి కోసం పదేపదే పిలుపునిచ్చిన పోప్ ఫ్రాన్సిస్ గారు .ఈ యుద్దని  క్రూరమైన, తెలివిలేని యుద్ధమని వ్యాఖ్యానించారు. మాస్కోకు వెళ్లి పుతిన్‌ని కలుస్తానని ఈ సందర్భంగా మరోసారి తెలిపారు.  యుద్ధాన్ని ఆపేందుకు తాను తప్పకుండా ప్రయత్నిస్తానని అన్నారు.

 

Add new comment

3 + 1 =