దైవసేవకులుగా మీ క్రియలకు సంతోషమే మూలకారణము: పోప్ ఫ్రాన్సిస్ 

priests from the Church of San Luigi dei Francesiపోప్ ఫ్రాన్సిస్

దైవసేవకులుగా మీ క్రియలకు సంతోషమే మూలకారణము: పోప్ ఫ్రాన్సిస్ 

రోము నగరం లో ఫ్రాన్స్ దేశానికీ సంబందించిన సాన్  లుఇజి డిఇ ఫ్రాన్సెసి అను సంఘంలోని గురువులను ఫ్రాన్సిస్ పోప్ గారు 7 జూన్ 2021 న కలిశారు.

ఫ్రాన్సిస్ పోప్ గారు కార్డినల్ గా ఉన్న సమయంలో రోము నగరానికి వచ్చిన ప్రతిసారి ఈ చర్చిని సందర్శించేవారు. కారవగ్గియో చిత్రించిన "పునీత మత్తయి గారి పిలుపు" అనే ఒక కళాఖండం అక్కడ ఉంది. దాని లోని సందేశం ఫ్రాన్సిస్ పోప్ గారికి ఎంతో ఇష్టమని పోప్ గారు అన్నారు.

దేవుని ప్రజల నుండి వివిక్తమైన జీవితాన్ని గురువులు జీవించరాదని ఎందుకంటే అది క్రైస్తవత్వం కాదని పోప్ గారు హితువు పలికారు.

"సంఘీభావం మరియు సోదరభావం కలిగిన నూతన ప్రపంచాన్ని స్థాపించడానికి క్రైస్తవులుగా మనం మన అవధులను తిరగరాసుకోవాలి. మనకు బలాన్ని ఇచ్చే క్రీస్తు యొక్క సహాయంతో మనం కష్టాలకు, శ్రమలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలి" అని పోప్ గారు సందేశం ఇచ్చారు.

"దైవత్వాన్ని ప్రసరిస్తూ అశాంతి నిండిన హృదయాలలో దైవవాక్కు అనే నిరీక్షణను నింపేవాడే గురువు" అని పోప్ గారు గుర్తుచేశారు. అందుకే గురువులు ఎప్పుడు గంబీరమైన వదనంతో ఉండకూడదు అన్నారు.

ఈ తరం దైవసేవకులుగా మీ క్రియలకు సంతోషమే మూలకారణము అని ఆయన అన్నారు.

సమావేశాన్ని ముగించబోయే ముందు పోప్ గారు తన ఫ్రెంచ్ అనువాదకులైన మోన్సిగ్నోర్ జీన్  లాందౌసిస్ గారిని అభినందించారు. మరి కొద్ది రోజులలో పదవీవిరమణ చేయబోతున్న ఆయన తన శారీరక అస్వస్థతను కూడా అధికమించి ఒక సంతోషచిత్తుడైన ఆదర్శ గురువుకు నిదర్శనం అని ప్రశంసించారు. 

 

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

2 + 16 =