దేవుని దృష్టిలో ప్రతిఒక్కరు అమూల్యమైన వారు: పోప్ ఫ్రాన్సిస్ 

ChildrenImage Source: Catholic Online

దేవుని దృష్టిలో ప్రతిఒక్కరు అమూల్యమైన వారు: పోప్ ఫ్రాన్సిస్ 

 

ఎన్నో నెలల తర్వాత ఫ్రాన్సిస్ పోప్ గారు తనకు అతి ప్రియమైన యాత్రికులైన చిన్న పిల్లలను కలిశారు.

సోన్నెంషెన్ అనే ఒక చిన్న పిల్లల కేంద్రం నుండి వచ్చిన చిన్న పిల్లలు ఫ్రాన్సిస్ పోప్ గారిని కలిశారు. వారిని ఉద్దేశించి మాట్లాడుతూ సోన్నెంషెన్ అంటే సూర్య కాంతి పుష్కలంగా ప్రసరించే పువ్వులు కలిగిన నేల అని అర్ధం అని, ఈ చిన్న పిల్లలు అందరు ఒకొక్క అందమైన పువ్వు లాంటి వారని ఆయన అన్నారు.

దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు అమూల్యమైన వారని, ఈ కారణంగా ఆయనకు ధన్యవాదములు తెలుపవలసిన ఆవశ్యకత ఉందని ఆయన ప్రభోదించారు.

చిన్న చిన్న మాటలైనా ఎంతో అర్ధవంతమైన మాటలతో పోప్ గారు ప్రసంగించారు. వారికి ఏమి కావాలన్నా నేరుగా క్రీస్తు ప్రభువును అడగవచ్చని ఆయన అన్నారు.

చిన్న పిల్లలు ప్రార్ధన ఎలా చెయ్యాలో చిన్న చిన్న ఉదాహారణలతో ఆయన వివరించారు. "తల్లిదండ్రులకు వారి పని పాటలలో సహాయం చెయ్యమని, ముసలి వారికి మంచి ఆరోగ్యం ఇవ్వమని, తిండి లేని వారికి ఆహరం ఇవ్వమని లేకపోతే క్రైస్తవులను మంచిగా నడిపించడానికి పోప్ గారికి జ్ఞానాన్ని ఇవ్వమని" ఇటువంటి చిన్న చిన్న ప్రార్ధనలు చేయవొచ్చు అని, వారి ప్రార్ధనను ప్రభువు తప్పక ఆలకిస్తారని పోప్ గారు అన్నారు.

చివరిగా పిల్లలకు, వారి అధ్యాపకులకు మరియు వారి తల్లిదండ్రులకు పోప్ గారు తన ఆశీర్వాదాన్ని అందించారు.

Add new comment

1 + 0 =