దేవుడు మన ప్రార్ధనను పెడచెవిన పెట్టరు: పోప్ ఫ్రాన్సిస్

Psalms ప్రతి ఒక్కరి కోసం ఒక ప్రత్యేకమైన రక్షణ ప్రణాళిక సిద్ధం చేసారు

దేవుడు మన ప్రార్ధనను పెడచెవిన పెట్టరు: పోప్ ఫ్రాన్సిస్

అక్టోబర్ 14 , 2020 న విశ్వాసులకు తన సందేశంలో ఫ్రాన్సిస్ పోప్ గారు కీర్తనల గ్రంధం గురించి ధ్యానించారు. ప్రార్ధనలో ఎదగడానికి కీర్తనల గ్రంధం ఒక మంచి మార్గదర్శి అని ఆయన అన్నారు.

"దేవుడు మన ప్రార్ధనను పెడచెవిన పెట్టరు, ముఖ్యంగా విరిగి నలిగినా హృదయాలతో ప్రార్ధించే వారి ప్రార్ధనను తప్పక వింటారు అనే ఒక గొప్ప నిజాన్ని కీర్తనలు మనకు తెలుపుతున్నాయని ఆయన ప్రభోదించారు.

పోప్ గారు సందేశం (క్లుప్తంగా)

ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్ధనను గూర్చిన మన సత్యోపదేశ పరంపరలో నేడు మనం కీర్తనల గ్రంధం గురించి ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంధం ప్రార్ధనల నిధి వంటిది. దేవుడు తనంతట తాను ఇచ్చిన మాటలతో ప్రార్ధించడం కీర్తనల గ్రంధంలో  మనకు కనిపిస్తుంది.  ఈ గ్రంధంలో మనం అనేక రకాల భావాలను చూస్తాం. స్తుతి, విజ్ఞాపన, కృతజ్ఞత మరియు కష్టాలు, బాధల నుండి విడిపించమని దేవునికి విజ్ఞాపన వంటి భావాలు కీర్తనలలో మనం చూడగలం.

దేవుడు మన ప్రార్ధనను పెడచెవిన పెట్టరు మరిముఖ్యంగా విరిగి నలిగిన హృదయాలతో ఆయనను వేడుకొనే వారి ప్రార్థనకు తప్ప జవాబు ఇస్తారు. కీర్తనలలో  పలు మార్లు  " ఎన్ని నాళ్ళు తండి?" అనే వాక్యమే, తండ్రి మన వేడుకోలును ఆలిస్తున్నారు అనే నిజానికి సాక్ష్యం ఇస్తుంది. మన పట్ల తండ్రికి అమితమైన ప్రేమ ఉంది, మన కష్టాలను, శ్రమలను చూసి ఆయన ఎంతో బాధ పడతారు. అందుకే ప్రతి ఒక్కరి కోసం ఒక ప్రత్యేకమైన రక్షణ ప్రణాళిక సిద్ధం చేసారు.

ప్రార్ధనలో ఎదగడానికి కీర్తనలు మంచి మార్గ దర్శకాలుగా ఉపకరిస్తాయి. కీర్తనలు దేవుని ప్రేమకు మన హృదయాలను తెరుస్తాయి, దేవుని వాగ్దానాలపై మనకు పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగిస్తాయి. విశ్వాసంలో మన జీవితాన్ని కొనసాగించడానికి కీర్తనలు మనకు ప్రేరేపణను ఇస్తాయి.

మన నాధుడైన యేసు క్రీస్తు ప్రభుని శాంతి సమాధానాలు మీ పై, మీ కుటుంబాలపై ప్రోక్షింపబడాలని ప్రార్ధిస్తున్నాను. ఆమెన్  

Add new comment

3 + 4 =