దేవుడు ప్రతి ఒక్కరికి ఒక గమ్యాన్ని నిర్దేశించారు

 దేవుడు ప్రతి ఒక్కరికి ఒక గమ్యాన్ని నిర్దేశించారుదేవునిసేవ

దేవుడు ప్రతి ఒక్కరికి ఒక గమ్యాన్ని నిర్దేశించారు

మనలో ఏ ఒక్కరు కూడా ప్రమాదవశాత్తు ఈ లోకములోనికి రాలేదని ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉందని, మనకు ఎన్ని బలహీనతలు ఉన్నా,  దేవుడు ప్రతి ఒక్కరికి ఒక గమ్యాన్ని నిర్దేశించారని కాసా మార్త నుండి ప్రజలకు తన సందేశం లో ఫ్రాన్సిస్ పాపు గారు అన్నారు.

ప్రతి మనిషి జీవితంలో తప్పులు జరుగుతాయి. మనం పాపంలో పడిపోయే అవకాశం ఉంది, ఎన్నో సార్లు పాపంలో పడిపోయాం కూడా. క్రీస్తు ప్రభువు, మరియ తల్లి తప్ప ఈ ప్రపంచంలో వారందరు పాపంలో పడిపోయినవారే. మనందరం పాపాత్ములం, దేవుని పట్ల మన దృక్పధం ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం అని పాపు గారు ప్రభోదించారు.

ఒక దాసుడు పాపములోనికి జారిపోయినా, పాపములో పడిపోయినా, క్షమాపణ కొరకు వేడుకోవాలి అని ఆయన వివరించారు.

పాపు గారి సందేశ భావం (క్లుప్తంగా)

ప్రతి ఒక్కరికి ఒక గమ్యం ఉంటుంది. దేవుడు ఏర్పర్చిన గమ్యం. నన్ను ఒక సేవకునిగా ప్రభువు ఎన్నుకొని, సేవ చేయాలనే బాధ్యతను నాకు అప్పగించారు.

సేవ చేయడం అంటే దాని ద్వారా మనకు ఇతర లాభాలు లభించాలని కాదు. సేవకు ఒక గొప్ప ఉదాహరణ దేవుని అతి గొప్ప సేవకుడైన క్రీస్తు ప్రభువు. మరణ సమయం వరకు సేవించడం క్రీస్తు ప్రభువు లోని ఒక గొప్ప సద్గుణం. ఆయన జీవితంలో ఓడిపోయాడు అనిపించినా, అది సేవా మార్గం అని మనం గుర్తించాలి అని పాపు గారు అన్నారు.

దేవుని బిడ్డలు సేవా దృక్పధం నుండి దూరం అయితే వారికి తెలియకుండా వారు మతభ్రష్టులైనట్లే. దీని వల్ల వారి జీవితాలు నశ్వరమైన ప్రేమ వైపునకు దారి తీస్తాయి అని ఆయన వివరించారు.

తన సేవకులుగా మనల్ని ఎన్నుకొని అభిషేకించిన ఆ దేవుని పట్ల మన దృక్పధం ఎలా ఉంది అనేది చాల ముఖ్యమని పాపు గారు అన్నారు. క్రీస్తు ప్రభువు మరియు మరియ తల్లి తప్ప మిగిలిన వారందరు పాపములో పడిపోయినవారే. పునీత పేతురుగారు మనకు ఒక చక్కని ఉదాహరణ. క్రీస్తును ఎరుగనని ఆయన ముమ్మారు బొంకిన వెంటనే కోడి కూసింది. అది విన్న పేతురు గారు పశ్చత్తాపంతో కుమిలిపోయారు. క్షమాపణ అడిగే దాసుని దృక్పధం ఇలానే ఉండాలి.

మరో రకమైన సేవకులు ఎలాంటివారంటే, తాము పాపములో పడిపోతున్నామని కూడా గ్రహించలేని వారు. వీరి హృదయాలు అన్నిటికి తెరువబడి ఉండి సాతాను సులువుగా ప్రవేశించడానికి అవకాశం ఇస్తాయి. సరిగ్గా యూదా ఇస్కరియోతు వాలే.

తన సందేశాన్ని ముగిస్తూ తండ్రి పరిచర్యను ఎంతో విశ్వాసపాత్రంగా కొనసాగించిన క్రీస్తుప్రభుని మనం ఆదర్శంగా తీసుకొవాలని, సంఘంలో మన హోదాను అవకాశంగా తీసుకొని లాభం కోసం చూడకుండా, ఆ దేవుని సేవకునిగా ఆయన పరిచర్యను కొనసాగించాలని, పాపము లో పడిపోతున్న ప్రతిసారి పేతురుగారిలా కన్నీటితో క్షమాభిక్షకోసం ఆ ప్రభుని వద్దకు రావాలని పాపుగారు చెప్పారు.

 

Article abstracted fromhttps://www.romereports.com/en/2020/04/07/pope-in-santa-marta-none-of-us-fell-into-the-world-by-chance/

Add new comment

2 + 7 =