దావీదు మహారాజు ప్రార్ధనా జీవితం క్రైస్తవులందరికి స్ఫూర్తిదాయకం

david prayer lifeసంగీతము, కవిత్వము ఆయన ప్రార్థనకు స్ఫూర్తి

దావీదు మహారాజు ప్రార్ధనా జీవితం క్రైస్తవులందరికి స్ఫూర్తిదాయకం.

 

గత బుధవారం విశ్వాసులకు తన సందేశం లో ఫ్రాన్సిస్ దావీదు మహారాజు యొక్క ప్రార్ధనను గూర్చి ధ్యానించారు. 

"సంగీతము, కవిత్వము ఆయన ప్రార్థనకు స్ఫూర్తి అని ఆయన అన్నారు. చిన్నప్పటినుండి గొర్రెలు కాసుకుంటూ, పాటలు పాడుకుంటూ  పెరిగిన దావీదు, సహజంగానే ఒక నాయకుడు. ఆయన భక్తికి నిదర్శనమే కీర్తనల గ్రంధం."అని ఆయన గుర్తు చేసారు. 

"దావీదు ఒక సమయంలో ఒక పునీతులా మరొక సమయంలో పాపాత్మునిలా అనిపిస్తాడు. అతని జీవితం ఎన్నో వైరుధ్యాలు ఉన్నా, తాను దేవునితో సంభాషిస్తూ ప్రార్ధించడం మాత్రం విడువలేదు. మనం కూడా ఇంతే, ప్రార్ధనలో గడిపితే మన వృత్తి ఏదైనా మనకు ఉన్న కష్టాలను అధికమించగలం. అప్పుడు మనం ఆ దేవుని ప్రేమలోని ఆనందాన్ని దగ్గరగా అనుభవించగలం." అని ఆయన ప్రభోదించారు. 

పాపు గారి సందేశ సారాంశం (క్లుప్తంగా)

ప్రార్ధనను గూర్చిన మన సత్యోపదేశ సందేశాలలో భాగంగా నేడు మనం దావీదు మహా రాజు యొక్క ప్రార్ధనను గూర్చి ధ్యానించుకుందాం. దేవుని చేత ఎన్నుకోబడిన ఇతను, ఒక గొర్రెల కాపరిగా గడించిన అనుభవం, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఎంతో ఉపయోగ పడింది.

చిన్న వయస్సు నుండే దావీదు సంగీతం, కవిత్వం పట్ల ఎంతో ఆకర్షితుడయ్యాడు. వీటి ద్వారానే దేవుని స్తుతించడం, ఆయన సృష్టిని మహిమ పరచడం నేర్చుకున్నాడు. ఇవే ఆయన ప్రార్థనకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి.

దావీదు రాజు రచించి పాడిన ఎన్నో కీర్తనలలో మనం దీనిని గమనించవచ్చు. ఒక రాజు గా మరియు ఒక బోధకునిగా దావీదు రాజు ప్రజలందరి కాపరి అయిన క్రీస్తుని రాకడను గూర్చి ముందే గ్రహించాడు. 

దావీదుని జీవితం మనం పరిశీలిస్తే ఒక సమయంలో ఒక పునీతులా మరొక సమయంలో పాపాత్మునిలా అనిపిస్తాడు. అతని జీవితం ఎన్నో వైరుధ్యాలు ఉన్నా, తాను దేవునితో సంభాషిస్తూ ప్రార్ధించడం మాత్రం విడువలేదు. మన జీవితాలలో కూడా ఇటువంటి పరిస్థితి అనేకసార్లు ఎదురౌతుంది. అనునిత్యం ప్రార్ధనలో గడిపితే మన వృత్తి ఏదైనా మనకు ఉన్న కష్టాలను అధికమించగలం. అప్పుడు మనం ఆ దేవుని ప్రేమలోని ఆనందాన్ని దగ్గరగా అనుభవించగలం.

మీ పై, మీ కుటుంబాలపై ఆ దేవాదిదేవుని యొక్క శాంతి సంతోషాలు ప్రోక్షింపబడాలని ప్రార్ధిస్తున్నాను. ఆమెన్ 

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/06/24/pope-francis-reflects-on-davids-prayer-life-as-an-example-for-christians/

Add new comment

2 + 16 =