తెలివిగా మంచి చేయమని సువార్త ప్రజలను పిలుస్తుంది - పోప్ ఫ్రాన్సిస్

సువార్త పోప్ ఫ్రాన్సిస్

ఆదివారం నాటి సువార్త పఠనంలో, యేసు అన్యాయమైన గృహనిర్వాహకుని యొక్క ఉపమానాన్ని చెప్పాడు, అతను నైపుణ్యం కలిగినవాడు కానీ నిజాయితీ లేనివాడు. ఫ్రాన్సిస్ పాపు గారు ఈ కథ యొక్క అర్ధాన్ని ఆధునిక కాలంలో ప్రతిబింబించారు, ఇది క్రీస్తు ప్రభువు కాలం కంటే చాలా భిన్నంగా లేదని ఆయన అన్నారు.

సహోదరులారా, నేటి ప్రపంచంలో కూడా సువార్తలో ఉన్నట్లుగా అవినీతి కథలు ఉన్నాయి; నిజాయితీ లేని ప్రవర్తన, అన్యాయమైన విధానాలు, వ్యక్తులు మరియు సంస్థల ఎంపికలపై ఆధిపత్యం వహించే స్వార్థం మరియు అనేక ఇతర చీకటి పరిస్థితులు పాటించే వారు ఉన్నారు.

అవినీతి పురోభివృద్ధిని చూసి నిరుత్సాహపడకుండా, తెలివిగా మంచి చేయమని సువార్త ప్రజలను పిలుస్తుందని పాపు గారు అన్నారు.

సువార్త యొక్క వివేకం మరియు తెలివితేటలతో, ఈ ప్రపంచంలోని వస్తువులను, భౌతిక వస్తువులను మాత్రమే కాకుండా, ప్రభువు నుండి మనకు లభించిన అన్ని బహుమతులను ఉపయోగించి మంచి చేసేటప్పుడు మనం సృజనాత్మకంగా ఉండాలని పిలువబడ్డాము. మనల్ని మనం సంపన్నం చేసుకోవడానికి కాదు గానీ సోదర ప్రేమ మరియు స్నేహాన్ని సృష్టించడానికి పిలువబడ్డాము అని పాపు గారు హితవు పలికారు.

ప్రార్ధనను అనంతరం ఇటీవల అజర్‌బైజాన్ మరియు ఆర్మేనియా మధ్య పునఃప్రారంభమైన కాకస్‌లలో సంక్షోభం గురించి పాపు గారు మాట్లాడారు.

అజర్‌బైజాన్ మరియు ఆర్మేనియా మధ్య ఇటీవల జరిగిన పోరాటానికి నేను బాధపడ్డాను. నేను బాధిత కుటుంబాలకు నా ఆత్మీయ సానుభూతిని తెలియజేస్తున్నాను మరియు శాంతి ఒప్పందానికి వెతుకుతున్నప్పుడు కాల్పుల విరమణను గౌరవించాలని పార్టీలను కోరుతున్నాను అని పాపు గారు చెప్పారు.

ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న ప్రజల కోసం మరియు ప్రతి యుద్ధంలో దెబ్బతిన్న భూమిలో శాంతి కోసం ప్రార్థిస్తూనే ఉంటాము అని పాపు గారు అన్నారు.

Add new comment

1 + 2 =