తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా విభూది బుధవారం రోజున ప్రజా సేవకు దూరంగా ఉంటానని ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు

తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా విభూది  బుధవారం రోజున ప్రజా సేవకు దూరంగా ఉంటానని ఫ్రాన్సిస్ పాపు గారు చెప్పారు
మీడియా నివేదికల ప్రకారం, తీవ్రమైన మోకాలి నొప్పి కారణంగా ఫ్రాన్సిస్ పాపు గారు మార్చి 2న విభూది బుధవారం రోజున జరిగే సేవలకు అధ్యక్షత వహించలేరు."తీవ్రమైన గోనాల్జియా" లేదా మోకాలి నొప్పి కారణంగా పాపు గారి  వైద్యులు "కాలుకు ఎక్కువ విశ్రాంతిని సూచించారు" అని వాటికన్ ఒక నోట్‌లో వివరించారు.ఈ నొప్పి 85 ఏళ్ల ఫ్రాన్సిస్ పాపు గారి  సయాటికాతో గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించినది అని అన్నారు.

పాపు గారి ఆరోగ్యం మెరుగు పడాలని ఆశిస్తూ ఆ దేవాది దేవుడిని ప్రార్దించుదాం

Add new comment

2 + 18 =