తరాల మధ్య అనుసంధానకర్తలు వృద్ధులు

The First World Day for Grandparents and the Elderlyతాతలు మరియు అమ్మమ్మ / నానమ్మ - వృద్ధుల దినోత్సవం

తరాల మధ్య అనుసంధానకర్తలు వృద్ధులు

25 జులై 2021 , ఆదివారం 

వాటికన్ లో మొట్ట మొదటి తాతలు మరియు అమ్మమ్మ / నానమ్మ - వృద్ధుల  దినోత్సవం కొనియాడారు. సెయింట్ పీటర్స్ బసిలికా లో జరిగిన దివ్యపూజాబలిలో సుమారు 2000 మంది విశ్వాసులు పాల్గొన్నారు.

ఈ దివ్యపూజను జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు అర్పించారు. సువిశేషానంతరం పాపు గారు ప్రసంగిస్తూ, ఆనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు మనకు మూడు ముఖ్య విషయాలు బోధిస్తున్నారని, అవే  దూరద్రుష్టి, పంచుకొనుట మరియు భద్రపరుచుట అని బోధించారు.

మన జీవితం పట్ల క్రీస్తు ప్రభువు దూరద్రుష్టి ఎలా ఉంటుందో అదే విధంగా మన తాతలు మరియు అమ్మమ్మ / నానమ్మ - వృద్ధుల దూరద్రుష్టి  కూడా ఉంటుందని, ఆకలి గొన్న వారికి క్రీస్తు ప్రభువు  ఏ విధంగా అయితే 5 రొట్టెలను 2  చేపలను 5000 మందితో పంచుకున్నారో, అదే విధంగా మన పెద్దలు తమ అనుభవాన్ని, జీవిత సత్యాలను తమ తరువాతి తరం వారితో పంచుకోవాలని, పెద్దవారు  చెప్పిన వారి జీవిత అనుభవాలు, వారు జీవిత సవాళ్ళను ఎలా ఎదుర్కొన్నారు అనే సంగతులను యువకులు భద్రపరచుకొని వాటిని అనుసరించి జీవితాన్ని సాగించాలని అన్నారు.

ప్రతి సంవత్సరం జులై 25 న తాతలు మరియు అమ్మమ్మ / నానమ్మ - వృద్ధుల దినోత్సవం జరగాలని. పెద్దలకు చిన్నలకు మధ్య ఉండే దూరం సమసిపోవాలి ఫ్రాన్సిస్ పాపు గారు ఆకాంక్షించారు.

వృద్ధాప్యం ఒక వరమని, తరాల మధ్య అనుసంధాన కర్తలు వృద్ధులని పాపు గారు అభివర్ణించారు.

అటువంటి వృద్ధులను మనం చిన్న చూపు చూడకూడదని, తమ జీవితంలో తెలుసుకొన్న సత్యాలను, తమ విశ్వాసాలను తరువాతి తరానికి ఒక నిధి వాలే అందజేయయడం ఒక గొప్ప విషయం. అందుకే వృద్దులు ఎప్పటికి చిరస్మరణీయులు అని పాపు గారు తన సందేశంలో అన్నారు.

Article by

Arvind Bandi

Online Producer

Add new comment

2 + 1 =