తరచూ మనం అవసరాలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వద్దకు వెళ్తాం

Pope francisImage source: Angelus News

తరచూ మనం అవసరాలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వద్దకు వెళ్తాం

 

ఏంజె లూస్  సమయంలో కాన్స్టాంటినోపుల్ నుండి పెద్దలు పునీత పేతురు గారి పండుగకు హాజరు కాలేనందుకు చింతించారు. ప్రతి సంవత్సరం పునీత పేతురు గారి పండుగకు వీరు హాజరు కావడం ఆనవాయితీ. కాగా కరోనా మూలంగా ఈ సంవత్సరం వారు హాజరు కాలేక పోయారు. 

కాన్స్టాంటినోపుల్ పెద్ద అయిన సహోదరుడు బర్తోలోమ్ కు నా ఆత్మీయ ఆలింగనం పంపుతున్నాను. త్వరలో మరలా రాకపోకలు సాధ్య పడాలని పాపు గారు ఆకాంక్షించారు. 

పేతురు గారి జీవితాన్ని గూర్చి ధ్యానిస్తూ, వవిశ్వాసులందరు తమ విశ్వాసంలో ముందుకు నడవాలని పాపు గారు సలహా ఇచ్చారు. ప్రార్ధన దేవుని వద్ద నుండి ఉపకారాలు పొందడానికి మాత్రమే కాదు, క్రీస్తుని గూర్చి మరింత లోతుగా తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు.

తరచూ మనం అవసరాలలో ఉన్నప్పుడు మాత్రమే దేవుని వద్దకు వెళ్తాం. మనం ఇంకా ముందుకు వెళ్లాలని, ప్రార్ధనలో ఇంకా ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. తద్వారా మనం ఆయన ఇచ్చే వారాలనే కాదు, ఆయనను కూడా వెతకాలి తండ్రి ఆకాంక్షిస్తున్నారు అని పాపు గారు ప్రభోదించారు .

దేవుని కోసం వెతకడం ద్వారా మన ఆప్తుల అవసరాలు మనకు కనిపిస్తాయని, తద్వారా మన సమయాన్ని మరియు మన జీవితాన్ని కూడా వారి కోసం అర్పించే స్థితికి మనం చేరుతామని ఆయన అన్నారు.

ఇది అందరికి వర్తిస్తుంది. తల్లిదండ్రులకు పిల్లల పట్ల, పిల్లలకు వయోవృద్ధులైన తమ తల్లిదండ్రుల పట్ల. నిరుపయోగమైన వ్యర్ధాలలాగా తమ పిల్లచే విడిచిపెట్టబడిన ముసలి వారైన తల్లిదండ్రులను గూర్చి తలుచుకుంటే చాల బాధగా ఉంది అని పాపు గారు తన బాధను వ్యక్తం చేసారు.

పునీత పేతురు మరియు పునీత పౌలు గార్ల పండుగ తర్వాతి రోజును కథోలిక సమాజం నీరో లో హింసలకు గురై క్రీస్తు కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని జ్ఞాపకం చేసుకుంటుంది. ఎక్కడైతే వారు చంపబడ్డారో ఆ స్థలంలో నేడు వాటికన్ నగరం ఉంది.

Add new comment

4 + 11 =