తండ్రికి విశ్వాసపాత్రంగా ఉండడం అంటే ఆయన విశ్వసనీయతను ఘనపరచడమే

విశ్వసనీయతఆయన తన వాగ్దానానికి కట్టుబడి ఉంటారు

తండ్రికి విశ్వాసపాత్రంగా ఉండడం అంటే ఆయన విశ్వసనీయతను ఘనపరచడమే

కాసా మార్త నుండి ప్రజలకు తన సందేశంలో దేవునియొక్క విశ్వసనీయతను గూర్చి ధ్యానించారు. మన విశ్వనీయత దేవుని విశ్వసనీయతకు సమాధానం అని, మన ప్రభువు తాను మాట పట్ల విశ్వసనీయత కలిగి ఉంటారని ఆయన అన్నారు.

తన కుమారుడు తిరిగి వస్తాడని మరలా మరలా విసుగక ఎదురుచూసే ఆ తండ్రి వంటిది మన తండ్రి విశ్వసనీయత. ఆ తండ్రి తన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఉత్సవం చేసుకోవడానికై మన పరమ తండ్రి ఎదురు చూసారు. మన తండ్రి విశ్వసనీయత ఒక ఉత్సవం వంటిది. అది ఎంతో సంతోషకరం. ఈ సంతోషం స్వస్థుడైన పక్షవాతరోగి ఏ విధంగా తండ్రి ఆలయంలోనికి గెంతుకుంటూ ప్రభువును స్తుతించుకుంటూ ఆనందంగా వెళ్ళాడో అలానే మన చేత కూడా చేయిస్తుంది. 

మన విశ్వసనీయత కంటే ముందు ప్రభువుని విశ్వసనీయత ఎప్పుడు ఉంటుంది. మన విశ్వసనీయత ఎప్పుడు మన తండ్రి విశ్వసనీయతకు సమాధానంగానే ఉంటుంది.

పాపు గారి సందేశం (క్లుప్తంగా) 

పవిత్ర గ్రంధంలో విశ్వాసానికి చిహ్నంగా పునీత మాగ్దలా మరియను చూపిస్తారని పాపు గారు గుర్తు చేసారు. దేవునికి విశ్వాసపాత్రంగా ఉండటం అంటే ఏమిటి అని పాపుగారు ప్రశ్నించారు. మన విశ్వాసపాత్రత మన తండ్రి విశ్వసనీయతకు జవాబు వంటిది అని ఆయన అన్నారు.

మన తండ్రి తన మాటకు మరియు వాగ్దానానికి విశ్వసనీయంగా ఉంటారు. ఆయన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ తన ప్రజలతో నడుస్తారు. ఆయన తన వాగ్దానానికి    కట్టుబడి ఉంటారు కనుకనే ఆయన మనకు అనేక సార్లు రక్షకునిగా దర్శనమిస్తారు.

గత బుధవారం నాటి మొదటి పఠనంలో పుట్టుకతో వికలాంగుడైన వ్యక్తి క్రీస్తు నామమున స్వస్థ పరచబడ్డాడు. దేవుని విశ్వసనీయతకు ఇది ఒక ఉదాహరణ. ఆయన ప్రతిసృష్టి చెయ్యగల సమర్ధుడు. తన విశ్వసనీయత వల్ల సృష్టి కన్నా ఆయన ప్రతిసృష్టి మరింత అద్భుతంగా ఉంటుంది. 

ఒక మంచి గొర్రెల కాపరిలా తప్పిపోయిన గొర్రెను వెతుకుటలో ఆయన ఎప్పుడు విసుగుచెందడు. తనకున్న ప్రేమ చేత విశ్వసనీయత చేత ఆయన ఇలా చేయగలుగుతారు. తప్పిపోయిన కుమారునికోసం ఎదురు చూసే తండ్రి లాగా ఆయన ఎన్నడూ విసుగు చెందారు. ఎప్పుడైతే ఆ కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడో అప్పుడు తండ్రి తప్పక ఉత్సవం చేస్తారు. ఆయన విశ్వసనీయత మనందరికీ ఒక ఉత్సవం.

మన దేవునికి ఉన్న ఆ దైవిక విశ్వసనీయత వల్లనే తనను ఎరుగనని ముమ్మారు బొంకిన పేతురుగారిని మరలా ఎన్నుకున్నారు. పునరుత్థానం తర్వాత పేతురు గారికి మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు ప్రభువు ఆయనతో ఏమి చెప్పారో మనకు తెలియదు కానీ ప్రభుని విశ్వసనీయత వల్లనే పేతురుగారు పిలువబడ్డారు.

చివరిగా మన విషయంలో "తండ్రికి విశ్వాసపాత్రంగా ఉండడం అంటే ఆయన విశ్వసనీయతను ఘనపరచడమే. ఆయన విశ్వసనీయతకు ప్రతిగా మనం చెయ్యగలిగినది ఇదే."
 

Article abstracted from: https://www.romereports.com/en/2020/04/15/pope-at-santa-marta-gods-faithfulness-always-precedes-us/

Add new comment

3 + 4 =