జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి హేరోదు వలె ఉండరాదు - పోప్ ఫ్రాన్సిస్

 సందేశంపోప్ ఫ్రాన్సిస్

మన జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి హేరోదు వలె ఉండరాదు - పోప్ ఫ్రాన్సిస్ 

2021 వ సంవత్సరానికి తన ఆఖరి సందేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు పునీత యోసేపు గారి ధైర్యాన్ని గురించి వివరించారు. యోసేపు గారు మరియతల్లిని మరియు బాల ఏసును బెత్లహేము నుండి ఐగుప్తుకు తీసుకువెళ్లడాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ రోజున అపాయం ఉందని వలస వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నవారి గురించి ఒక సారి ఆలోచించండి అని పాపు గారు అన్నారు. పదవి కోసం ఎటువంటి పనైనా చెయ్యడానికి వెనుకాడని క్రూరుడైన హేరోదు రోజుకు మరియు యోసేపు గారికి మధ్య వ్యత్యాసాన్ని గమనించాలి అని పాపు గారు గుర్తు చేసారు.

మనం నియంతృత్వ స్వభావం కలిగి ఉంటేనే మనం హేరోదు రాజు వలె ఉన్నాము అని కాదు. నిజానికి మనం అహంకరించి మనకు ఆప్తులైన వారిని అవమానించి వారిని కించపరిచే దృక్పధంతో ఉంటే అది హేరోదు రాజు స్వభావం వంటిదే అని పాపు గారు గుర్తు చేసారు. జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్లు ఎదురౌతూ ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి హింసామార్గమో లేక మనలో రాక్షస స్వభావమో ఉండవలసిన అవసరం లేదు అని పాపు గారు హితవు పలికారు.

గొప్పవారికే ధైర్యం ఉంటుందని ఒక తప్పుడు అభిప్రాయంలో ఉంటాం. కానీ ప్రతిఒక్కరికి తమ అనుదిన జీవితంలో ధైర్యం కావలసి ఉంటుంది. జీవితంలో మనందరికీ ధైర్యం ఎంతో అవసరం. మన అనుదిన జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడానికి మనకు ధైర్యం కావలి అని అన్నారు.

యుద్ధము, దారిద్య్రము మరియు అపాయముల కారణంగా వలస వెళ్తున్న ప్రతిఒక్కరిలో మనం మరియతల్లి ఒడిలో ఉన్న బాల ఏసుని చూడాలని పాపుగారు విశ్వాసులకు పిలుపునిచ్చారు.

Add new comment

1 + 12 =