జీవజల ప్రధాత ఐన క్రీస్తుతో మనం ఐక్యమై ప్రార్ధన ద్వారా వ్యాధి బాధలలో ఉన్నవారికి దగ్గర కావాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

Pope thanks priestsజీవజల ప్రధాత ఐన క్రీస్తుతో మనం ఐక్యమై ప్రార్ధన ద్వారా వ్యాధి బాధలలో ఉన్నవారికి దగ్గర కావాలి

జీవజల ప్రధాత ఐన క్రీస్తుతో మనం ఐక్యమై ప్రార్ధన ద్వారా వ్యాధి బాధలలో ఉన్నవారికి దగ్గర కావాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

సామాన్య ప్రజలను పాపు గారు సందర్శించే సెయింట్ పీటర్స్ స్క్వేర్ కరోనా ప్రభావం వలన మూసివేయబడగా, రోము నగర వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్సిస్ పాపు గారు తన సందేశాన్ని అపోస్తలిక గ్రంధాలయం నుండి ప్రజలకు టీవీ ద్వారా అందిస్తున్నారు.

గత సోమవారం తన సందేశంలో ఈ కష్టకాలంలో ప్రజలకు తోడుగా ఉన్న గురువులు ముఖ్యంగా ఉత్తర ఇటలీ లోని గురువులను పాపు గారు ప్రశంసించారు.

నేను ఆ గురువుల అంకితభావానికి సృజనాత్మకతకు కృతఙ్ఞతలు తెలుపుతున్నాను. లొంబార్ఢ్య నుండి వస్తున్న సమాచారం ప్రకారం అక్కడ కరోనా తాకిడి చాలా ఎక్కువగా ఉంది. కానీ అక్కడి గురువులు చూపిస్తున్న అంకితభావం, ప్రజలకు దగ్గరగా ఉంది వారికి సేవలు చెయ్యడం ద్వారా ప్రజలకు అభద్రతాభావం లేకుండా చెయ్యడం ఎంతో ముభావహం అని ఆయన ప్రశంసించారు.

తపస్కాలంలోని మూడవ ఆదివారం నాటి దివ్య గ్రంథ పఠనం గూర్చి పాపు గారు మాట్లాడుతూ, యోసేపు బావి వద్ద సమారియా స్త్రీ మరియు క్రీస్తు ప్రభువు కు మధ్య జరిగిన సంభాషణ గూర్చి బోధించారు. మన ఆత్మ దాహాన్ని తీర్చగవాడు ప్రభువు మాత్రమే అని ప్రభోదించారు.

మన నిరీక్షణ, మన దాహం క్రీస్తు ప్రభువులో ఉన్నాయని మనం కనుగొన్న నాడు, ఇహలోక వస్తువులు మనకు తృప్తిని ఇవ్వవు అని గ్రహిస్తాము. మన ఆత్మ దాహం తీర్చే శక్తి క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది ఎందుకంటే ఆయన వద్ద నిత్యజీవజలం ఉంది. అని పాపు గారు చెప్పారు.

ఉపద్రవం కారణంగా మనల్ని మనం ప్రపంచానికి దూరంగా ఒంటరిగా గడుపుతున్న ఈ తరుణంలో క్రీస్తు ద్వారా, మరియు సత్ప్రసాదం ద్వారా మనల్ని మనం నూత్నీకరించుకోవాలని ఆనయ అన్నారు.

క్రీస్తుతో ఐక్యమైన మనం ఒంటరి వాసరం కాదు, మనం ఏక శరీరులం. ఇది ప్రార్ధన మరియు ఆత్మీక సత్ప్రసాదంతో పోషింపబడు ఐక్యత. సత్ప్రసాదం స్వీకరించలేని ఈ సమయంలో ఇటువంటి ప్రార్ధన ఐక్యత మనకు ఎంతో ఆవశ్యకం అని పాపుగారు తెలిపారు.

చివరిగా వ్యాధితో బాధపడుతున్న వారికోసం తాను నిరంతరం ప్రార్ధిస్తున్నాని, ప్రార్ధన ద్వారా తాను వారికి ఎంతో సన్నిహితంగా ఉన్నానని పాపు గారు అభయమిచ్చారు.

మనం కూడా జీవజల ప్రదాత ఐన క్రీస్తుతో ఐక్యమై వ్యాధి బాధలలో ఉన్నవారికోసం ప్రార్ధిద్దాం.

 Article source link: https://www.romereports.com/en/2020/03/16/pope-at-angelus-thanks-priests-who-have-found-creative-ways-to-stay-close-to-people/ 

Add new comment

11 + 4 =