జంట బాంబు దాడిని పోప్ ఫ్రాన్సిస్ గురువారం ఖండించారు

ఆత్మాహుతి దాడులతో  ఇరాక్ రాజధాని బాగ్దాద్ రక్తసిక్తమైంది.బాగ్దాద్‌లోని బాబ్‌ అల్‌ షార్కీ ప్రాంతంలోని మార్కెట్‌లో గురువారం ఉదయం ఉగ్రవాదులు ఈ ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు.

ఈ ఉగ్రవాద దాడుల్లో ఇప్పటివరకు 32 మందికి పైగా  మరణించారు. మరో 75 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరగవచ్చని అధికారులు తెలిపారు.

ఒక ఉగ్రవాది అస్వస్థతకు గురైనట్లు నటించి కుప్పకూలాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న  ప్రజలు అతడి వద్ద గుమికూడారు. శరీరానికి పేలుడు పదార్థాలు అమర్చుకొని ఉన్న అతడు ఒక్కసారిగా తనను తాను పేల్చుకున్నాడు.ఘటనాస్థలిలో ప్రజలు సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సమయంలో పేలుడు పదార్థాలు ధరించిన మరొక ఉగ్రవాది ఆ జనంలో కలిసి ఒక్కసారిగా ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈసారి మరింత మంది మృత్యువాతపడ్డారు.

బాగ్దాద్ మార్కెట్లో జరిగిన జంట బాంబు దాడిని పోప్ ఫ్రాన్సిస్ గురువారం ఖండించారు మరియు ఈ దాడులను "తెలివిలేని క్రూరత్వ చర్య" గా అభివర్ణించారు. "మరణించిన బాధితులు మరియు వారి కుటుంబాల కోసం, గాయపడినవారికి మరియు హాజరైన అత్యవసర సిబ్బంది కోసం" ప్రార్థిస్తున్నానని చెప్పారు పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.

సోదరభావం, సంఘీభావం మరియు శాంతి" తో హింసను అధిగమించడానికి ఇరాక్ కృషి చేస్తుందని తాను ఆశిస్తున్నానని పోప్ ఫ్రాన్సిస్ తెలిపారు.

Add new comment

2 + 1 =