గురుత్వం శ్రేష్ఠమైన బహుమానం - పొప్ ఫ్రాన్సిస్ గారు

గురుత్వం శ్రేష్ఠమైన బహుమానం - పొప్ ఫ్రాన్సిస్ గారు    

అక్టోబర్ 01  న రోమ్ వేదికగా అపోస్తలిక భవనంలో రక్షణ సభ సభ్యులతో పొప్ ఫ్రాన్సిస్ గారు సమావేశమయ్యారు.   రక్షణ సభ కు నూతనం గా ఎన్నికైన  సుపీరియర్ జనరల్  గురుశ్రీ రోగేరియో గోమ్స్ గారు సభ అభివృది కొరకు పొప్ ఫ్రాన్సి గారి నుండి  అమూల్య సలహాలు, సూచనలు తీసుకున్నారు.
పొప్ ఫ్రాన్సిస్ గారు ఈ సందర్భముగా మాట్లాడుతూ  "పేదలకు సువార్తను బోధించుటకు దేవుడు మనలను  ఎన్నుకున్నారు" అని, గురుత్వ జీవితం దైవ నిర్ణయం అని, దేవుడు ఒసగిన  శ్రేష్టమైన బహుమానం అని పొప్ ఫ్రాన్సిస్ గారు అన్నారు.   
పవిత్రతతో జీవిస్తూ, సామాన్యులకు ఆదర్శముగా ఉండాలని ,ప్రభు యేసుని ప్రేమను,శాంతిని  కరుణను ఇతరులకు చూపించే విధం గా జీవించాలని తన ఉపన్యాసాన్ని ముగించారు.     

పునీత అల్ఫోన్స్ మరియు లిగోరి గారు రక్షణ సభ వ్యవస్థాపకులు. వీరు దాదాపుగా 70  కి పైగా దేశాలలో దేవుని సేవ చేస్తున్నారు.      

Add new comment

1 + 0 =