క్రీస్తే ప్రభువే మన నిజమైన ఆనందం- పోప్ ఫ్రాన్సిస్ గారు

క్రీస్తే ప్రభువే మన నిజమైన ఆనందం- పోప్ ఫ్రాన్సిస్ గారు

బుధవారం జనరల్ ఆడియన్స్ సందర్భంగా, జగద్గురువులు మహా పూజ్య పోప్ ఫ్రాన్సిస్ తండ్రిగారు పునీత పేతురు మహాదేవాలయ ఆవరణలో గుమ్మి కూడిన విశ్వాసులతో మాట్లాడారు .
ఆయన మాట్లాడుతూ! యేసుక్రీస్తు  మనందరి  ఆనందానికి మూలం అని, మన నమ్మకమైన నిజ స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువే అని అన్నారు. మరియు మన జీవిత  ప్రయాణంలో ఎల్లప్పుడు ఆయన మనతోనే ఉంటారు అని నొక్కి చెప్పారు.
క్రీస్తుతో స్నేహం మన జీవితాన్ని సరికొత్తగా మారుస్తుందని,ఎల్లవేళలా ఆనందోత్సాహాన్ని కలిగిస్తుందని ఈ సందర్భముగా ఆయన అన్నారు. ఎమ్మావు మార్గంలో ఇద్దరు శిష్యులు క్రీస్తును కనుగొని ఆయనతో సంభాషించిన తర్వాత వారి హృదయాలు ఆనందంతో నిండిపోయాయని పోప్ విశ్వాసులకు గుర్తు చేశారు.
క్రైస్తవులు గా మనము క్రీస్తులో మరింతగా ఎదగాలని,ఆయనలో ఆనందించాలని ఆ ఆనందాన్ని పలువురితో పంచుకోవాలని ఆయన విశ్వాసులని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రార్థనల్లో  ప్రభు క్రీస్తుతో మాట్లాడాలని, క్రీస్తులోనే నిజమైన ఆనందం ఉందని గుర్తించాలని , క్రీస్తు ప్రేమను దశదిశలా చాటాలని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Add new comment

4 + 1 =