క్రీస్తు ప్రభువు కుటుంబానికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది: పోప్ ఫ్రాన్సిస్

messageవీరందరికొరకై నేను ప్రత్యేకముగా ప్రార్ధిస్తాను

క్రీస్తు ప్రభువు కుటుంబానికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది: పోప్ ఫ్రాన్సిస్

కవుకసూస్ దేశం లో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలో శాంతి నెలకొనడానికి ప్రార్ధిద్దాం అనే అభ్యర్ధనతో గత సోమవారం ( 28 సెప్టెంబర్ 2020 ) ఫ్రాన్సిస్ పోప్ గారి సందేశం ప్రారంభమైంది.

2016 తాను సందర్శించిన అర్మేనియా మరియు అజెర్బైజాన్ దేశాల మధ్య వివాదాన్ని కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ తో చూస్తున్నట్లుగా పేర్కొన్నారు.

సెప్టెంబర్ 28 కి రెండు ప్రత్యేకతలు ఉన్నాయని వాటిలో ఒకటి ప్రపంచ పర్యాటక దినోత్సవమని ఆయన గుర్తు చేసారు.

తమ దేశాలకే ముఖ్య ఆదాయం పర్యాటక రంగమైన కొన్ని దేశాలు ఈ కరోనా మహమ్మారి వల్ల బాగా దెబ్బ తిన్నాయని, ఈ రంగం పనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు, చిన్న చిన్న వ్యాపారాలు, నిరుద్యోగులైన యువత వీరందరికొరకై నేను ప్రత్యేకముగా ప్రార్ధిస్తాను అని ఆయన ప్రకటించారు.

సెప్టెంబర్ 28 ని ప్రపంచ వలసవాదుల మరియు శరణార్ధుల దినోత్సవంగా కూడా కథోలిక సమాజం గుర్తుచేసుకుంటుదని ఆయన చెప్పారు. 1914 వ సంవత్సరము నుండి ఈ దినోత్సవాన్ని కథోలిక సమాజం కొనియాడుతుందని ఆయన గుర్తు చేసారు.

నివాసాలు కోల్పోయి, తాము ఉంటున్న చోటు నుండి బలవంతముగా వెళ్లిపోవాల్సి వచ్చిన  వారందరికీ ఈ సంవత్సరపు సందేశం సమర్పిస్తున్నానని ఆయన అన్నారు.

క్రీస్తు ప్రభువు కుటుంబానికి కూడా ఇటువంటి పరిస్థితి ఎదురైంది. తాము ఉంటున్న చోటు నుండి మరో ప్రదేశానికి బాలాంతముగా వెళ్ళవలసి వచ్చింది అని ఆయన పోల్చారు.

సంవత్సర కాలం క్రితం ఫ్రాన్సిస్ పోప్ గారు ఆవిష్కరించిన "ఏంజెల్స్ ఉనవారిస్"అనే శిలా విగ్రహం వద్ద అనేకమంది సందర్శకులు గుమ్మిగూడడం ఇక్కడ ఆశక్తి కర అంశము. కర అంశము.

Add new comment

12 + 3 =