క్రీస్తు ప్రభుని ప్రార్ధనలో మనకు అధిక విశ్వాసం ఉండాలి : ఫ్రాన్సిస్ పాపు గారు

క్రీస్తు ప్రభుని ప్రార్ధనలో మనకు అధిక విశ్వాసం ఉండాలి : ఫ్రాన్సిస్ పాపు గారుPeter's Faith

క్రీస్తు ప్రభుని ప్రార్ధనలో మనకు అధిక విశ్వాసం ఉండాలి : ఫ్రాన్సిస్ పాపు గారు.

కాసా మార్తా నుండి ప్రజలకు తన సందేశంలో ప్రసంగిస్తూ, పేతురుగారిని ప్రధానార్చకులు బోధ చెయ్యకూడదని ఆటంక పరిచినప్పుడు  ఏ విధంగా పేతురుగారు క్రీస్తు ప్రభుని ప్రార్ధన యొక్క శక్తిలో నాటబడిన విశ్వాసంతో ముందుకు సాగరో పాపు గారు గుర్తు చేసుకున్నారు. ఏ విధంగా క్రీస్తు ప్రభుని ప్రార్ధన పేతురుగారికి బలాన్ని ఇచ్చిందో, అదే విధంగా క్రీస్తు ప్రభువు మన బలం కోసం ప్రార్థిస్తున్నారు అని ఆయన అన్నారు.

మన విశ్వాసము మరింత దృఢపడాలి. మన ప్రార్ధనలో కాక క్రీస్తు ప్రభుని ప్రార్ధనలో మనకున్న విశ్వాసం దృఢపడాలి. "క్రీస్తువా మా కొరకు ప్రార్ధించండి" "మీరు తండ్రికి మాకు మధ్య మధ్యవర్తి కనుక మీరు మా కొరకు తండ్రిని వేడుకొనండి". పేతురుగారి రహస్యం ఇదే. పేతురు గారి విశ్వాసం సడలిపోకుండునట్లు క్రీస్తు ప్రభువు ఆయన కోసం ప్రార్ధించారు అని పాపు గారు అన్నారు.

ఈ ప్రార్ధన వల్లనే పేతురుగారు పవిత్రాత్మతో నింపబడి పిరికితనాన్ని విడిచిపెట్టి ధైర్యవంతునిగా పరివర్తన చెందారు.

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

ఈ కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ప్రదేశాలలో అనేక కుటుంబాలు, నిత్యావసరాలకొరకు, ఆకలితో సతమతమౌతున్నాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ పరిస్థితి వల్ల మనస్సాక్షి లేని, అయోగ్యులైన వడ్డీ వ్యాపారాలు లబ్ది పొందుతున్నారు.

ఇది మరొక రకమైన వైరస్, ఇది సాంఘిక మహమ్మారి.

ఈ సమయంలో పనులు లేక సంపాదన లేక ఎన్నో కుటుంబాలు, పస్తులు ఉంటున్నారు. వీరి వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బును కూడా నీతిలేని వడ్డీ వ్యాపారాలు గుంజేస్తున్నారు.

దేవుని దయ, సహాయం ప్రోక్షింపబడాలని ఇటువంటి కుటుంబాల కోసం ప్రార్ధిద్దాం. అదేవిధంగా దేవునిచే ముట్టబడి హృదయ పరివర్తన చెందాలని వడ్డీ వ్యాపారుల కోసం కూడా ప్రార్థిద్దాం.

అపొస్తలులు మరి ముఖ్యంగా పేతురు గారు ఎంతో ధైర్యంగా తమ విశ్వాసాన్ని ఎలుగెత్తి చాటారు. మనం సరిగ్గా గమనించినట్లయితే పేతురు గారు స్వతహాగా ఎంతో భయస్తుడు, పిరికి వాడు. చివరకు క్రీస్తు ప్రభువు ఎవరో కూడా తెలియదని ముమ్మారు బొంకాడు.

అటువంటి పేతురుగారు ఎలా మారారో గమనించండి. అది పవిత్రాత్మ యొక్క మహత్మ్యమే అపొస్తలుల కార్యాలు 5 : 32 లో చెప్పబడినట్లు దేవుడు తనకు విధేయులైన వారికి పవిత్రాత్మను అనుగ్రహిస్తున్నారు.

పేతురుగారు తన పరిచర్యలో మృదుత్వాన్ని ఎంచుకొని ఉండవచ్చు కానీ దేవుని పరిచేర్యంలో ధైర్య సాహసాలతో కుడి మార్గాన్ని ఆయన ఎన్నుకున్నారు. మన చరిత్రలో కూడా ప్రజలను రక్షించడానికి సంఘంలో అనేకులు ఈ మార్గాన్ని ఎన్నుకున్నారు. కొన్ని సార్లు మాత్రం సంఘ కాపరులు తమనుతాము రక్షించుకోవడానికి సంఘాన్ని విస్మరించడం జరిగింది.

క్రీస్తు తన కుమారుడని తండ్రి పేతురు గారికి ఎరిగించారు కానీ బలహీనతకు లోనై పేతురుగారు క్రీస్తును ఎరుగనని అన్నారు. క్రీస్తు పునరుత్థాన అనంతరం పేతురుగారు పవిత్రాత్మతో నింపబడి మరల అనుగ్ర పరిపూర్ణులైనారు.

క్రీస్తు సిలువ శ్రమలు అనుభవించడానికి ముందు తన శిష్యులతో అన్న మాటలు ఈ విషయాన్నీ చక్కగా వర్ణిస్తాయి. "ఇది శోధన సమయం, సాతానుడు మిమ్ము  గోధుమల వాలే తూర్పారబట్టాలని చూస్తున్నాడు. కానీ మీరు పాపములో పడకుండునట్లు నేను మీ కొరకు ప్రార్ధిస్తాను" అని క్రీస్తు అంటున్నారు.

ఏ విధంగా పేతురు గారి కోసం క్రీస్తు ప్రభువు ప్రార్ధన చేస్తున్నారో అదే విధంగా మన కోసం కూడా ప్రార్థిస్తున్నారు. పేతురు గారు ఏ విధంగా పవిత్రాత్మ శక్తి ద్వారా పిరికితనం నుండి ధైర్యానికి నడిపింపబడ్డారో మన జీవితాలలో కూడా అటువంటి పరిణామం రావడానికి ప్రార్ధిస్తున్న క్రీస్తు ప్రభువునకు మనం కృతఙ్ఞతలు కలిగి ఉండాలి.

మనకు మన ప్రార్థనలలో కంటే తండ్రికి మనకు మధ్యవర్తిత్వం వహిస్తున్న క్రీస్తు ప్రభుని ప్రార్ధనలో అధిక విశ్వాసం ఉండాలి. దయామయుడైన ప్రభువు మన జీవితాలలో తన దయను కురిపించాలని ప్రార్థిద్దాం.

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/04/23/pope-at-santa-marta-we-must-have-more-faith-in-jesus-prayer/

Add new comment

16 + 1 =