క్రీస్తు ఈ మానవ లోకానికి వచ్చి తనకు తానే మన పాపాలను తనపై వేసుకొని శిక్షను అనుభవించారు.

christ on crossమన పాపాలను తనపై వేసుకొని శిక్షను అనుభవించారు

క్రీస్తు ఈ మానవ లోకానికి వచ్చి తనకు తానే మన పాపాలను తనపై వేసుకొని శిక్షను అనుభవించారు.

 

గత మంగళవారం కాసామార్త నుండి ప్రజలకు తన సందేశంలో ఫ్రాన్సిస్ పాపు గారు క్రీస్తు మనందరి పాపములను తన భుజముపై మోయుటకే ఈ లోకానికి వచ్చారు. క్రైస్తవులందరూ ఆ పవిత్ర సిలువను విముక్తికి సూచనగా చూడాలని ఆయన అన్నారు.

సిలువ శ్రమలలోని రహస్యాన్ని అర్ధం చేసుకోవడం సులభం కాదు. వాటిని అర్ధం చేసుకోవడంలో ఒక నిర్ణయానికి రాలేమని, ఆ సిలువ శ్రమలను ధ్యానించుకొని, ప్రార్ధించుకొని, ప్రభువునకు కృతఙ్ఞతలు తెలుపడం మాత్రమే మనం చేయగలమని ఆయన ప్రభోదించారు.

పాపు గారి సందేశం (క్లుప్తంగా)

సర్పములు  కచ్చితంగా స్నేహపూర్వక ప్రాణులు  కాదు. అవి ఎప్పుడు సాతానుతో సంబంధం కలిగి ఉంటాయి. ప్రకటనలలో కూడా పాపమును కలిగించడానికి సాతాను సర్పమును ఉపయోగించుకున్నట్లు మనము చూస్తాం. మనలను కాటువేసి, మనల్ని విషపూరితం చేసి, మనలను నాశనం చేసి, మనకు మరణమును తెచ్చు ఈ సర్పమును ప్రకటన గ్రంధంలో 'మహా ఘటసర్పము'గా అభివర్ణించడం జరిగింది.

ప్రతి సారి ఇది పునరావృతం అవుతుంది. "మమ్ము ఐగుప్తు నుండి ఈ ఎడారిలోనికి మరణించడానికి తీసుకువచ్చావా?  వారు ఎప్పుడు ఐగుప్తుకు తిరిగి వెళ్లాలనే ఆశ పడ్డారు. "మేము అక్కడ సంతోషంగా ఉన్నాం. కడుపునిండా తిన్నాం"
 
ఆ సమయంలో యావే ప్రభువు కూడా తన ప్రజల మాటలకు, పనులకు విసుగు చెందినట్లుగా అనిపిస్తుంది. ఆయన వారిపై ఆగ్రహించారు. వారి మధ్యకు సర్పములను పంపించెను. ఆ సర్పములు వారిలో చాల మందిని కరవగా వారు మరణించిరి. ఆ సమయంలో సర్పము పాపమునకు చిహ్నము. సర్పమును చూసినప్పుడు వారి పాపములు వారికి కనిపించెను. వారికి పశ్చాతాపం కలిగింది.

ఇక్కడ ముఖ్య సందేశం ఏమిటంటే క్రీస్తు మనకోసం తననుతాను పాపాత్మునిగా చూపించుకున్నారు. ఆయన ఏ పాపం చెయ్యలేదు కాని మన వలన పాపాత్మునిగా ముద్ర వేయ బడ్డారు. పునీత పేతురుగారు తన లేఖ లో రాసినట్లు "మనం ఆ సిలువను చూసినప్పుడు ఆ ప్రభువు శ్రమలు గుర్తుకు వస్తాయి. మన పాపాలకు ఆ దైవ కుమారుడు చేసిన త్యాగం జ్ఞాపకం వస్తుంది." ఇక్కడ మనం ఒక్క విషయం గ్రహించాలి మనం ఘోరమైన పాపులమైనా మన పాపాలను తనపై వేసుకున్నారు. దేవుని కుమారుడైన క్రీస్తు ఈ మానవ లోకానికి వచ్చి తనకు తానే మన పాపాలను తనపై వేసుకొని శిక్షను అనుభవించారు.

దీనిని అర్ధం చేసుకోవడం చాల కష్టం. మనం ఈ విషయాన్నీ ధ్యానించి, దీని గూర్చి ప్రార్ధించి, నిరంతరం ఆ ప్రభువునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి.
 

Article Abstracted from: https://www.romereports.com/en/2020/03/31/pope-at-santa-marta-on-the-cross-jesus-did-not-pretend-to-suffer-and-die-abandoned/

Add new comment

14 + 6 =