కుష్ఠువ్యాధితో బాధ పడుతున్న వారి కోసం ప్రార్ధించిన ఫ్రాన్సిస్ పాపు గారు

కుష్ఠువ్యాధిపోప్ ఫ్రాన్సిస్

కుష్ఠువ్యాధితో బాధ పడుతున్న వారి కోసం ప్రార్ధించిన ఫ్రాన్సిస్ పాపు గారు.

అందరు కలిసికట్టుగా కుష్ఠువ్యాధిని అరికట్టాలి అని ఫ్రాన్సిస్ పాపు గారు పిలుపునిచ్చారు. ప్రపంచ కుష్ఠువ్యాధిగ్రస్తుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రాన్సిస్ పాపు గారు విశ్వాసులకు ఇచ్చిన సందేశంలో ఈ విజ్ఞాపన చేసారు.  2020 సంవత్సరంలో సుమారు 130 వేలమంది కుష్టువ్యాధి బారిన పడ్డారని, ప్రాధమికంగా ఆఫ్రికా మరియు ఆసియ ఖండాలలో ప్రజలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడినట్లు పాపు గారు గుర్తుచేశారు. 

దురదృష్టవశాత్తు నేటికికూడా ఎంతోమందిని బాధిస్తున్న ఈ వ్యాధిని అరికట్టడానికి అందరు కృషిచేయాలి. వ్యాధి బారిన పడిన వారిని వెలివెయ్యకుండా వారిని ప్రేమతో ఆదరించాలని పాపు గారు హితవు పలికారు.

చాంద్రమాన నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న ఈ తరుణంలో ప్రేమ, శాంతి మరియు భద్రతతో అందరు కలిసి జీవించే వాతావరణం నెలకొనాలని పాపు గారు ఆకాంక్షించారు. 

అందరు కుటుంబ సమేతంగా కలిసి ఉత్సవాలను జరుపుకొనే వాతావరణం ఉంటే ఎంత మనోహరంగా ఉంటుంది? కానీ దురదృష్టవశాత్తు కరోనా మహమ్మారి కారణంగా అది సాధ్య పడే అవకాశం లేదు. మనం ఈ విపత్కర పరిస్థితులను త్వరలోనే అధికమిచాలని ఆశిస్తున్నాను అని పాపు గారు తన ఆకాంక్షను తెలిపారు. ప్రపంచంలోని సెలేషియన్ సంఘానికి పాపు గారు పునీత జాన్ బోస్కో గారి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పునీత జాన్ బోస్కో గారు యువతకు చేసిన గొప్ప సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.

యువతకు మార్గదర్శకుడు మరియు తండ్రి వంటి పునీత జాన్ బోస్కో గారు దేవాలయపు నాలుగు గోడల మధ్య తనను తాను బంధించుకోకుండా వీధులలోకి వచ్చి పెడత్రోవ పట్టిన యువతను ఆకర్షించి వారి జీవితాలలో వెలుగు నింపారు అని పాపు గారు అన్నారు.

శాంతికరమైన భవిష్యత్తు కోరుకుంటూ అందుకు చిహ్నంగా రోము నగరంలోని పునీత పేతురు గారి దేవాలయం వద్ద గాలి బుడగలు నింగికి ఎగురవేసిన  కాథలిక్ యాక్షన్  గ్రూప్ వారిని అభినందిస్తూ పాపు గారు తన సందేశాన్ని ముగించారు.

Add new comment

8 + 11 =