కార్డినల్ హోదాకు ఎంపికైన సభ్యులు

pope francis

 పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్  హోదా కోసం 13 మంది జాబితాను ఎంపిక చేశారు.  క్యాథలిక్ చర్చిలో కార్డినల్ హోదాను ఎంతో అరుదైన గౌరవంగా భావిస్తారు.రోమన్ క్యాథలిక్ చర్చిలో పోప్ కింద వీరు అత్యంత సీనియర్ మతాధికారులుగా బాధ్యతలు నిర్వరిస్తారు. వాటికన్ సిటీలో సెయింట్ పీటర్ స్క్వేర్ లోని క్యాథలిక్ చర్చి కిటికీ వద్ద నిల్చుని ఈ ప్రకటన  చేశారు పోప్ ఫ్రాన్సిస్. నవంబరు 28న హోదా కోసం ఎంపికైన 13మంది కార్డినల్ ల కోసం వేడుకల ను నిర్వహిస్తారు. 13 మంది లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చెందిన ఆర్క్ బిషప్ విల్టన్ గ్రెగరీ ఉన్నారు. ఈ గౌరవాన్ని అందుకున్న తొలి నల్లజాతి అమెరికన్ గా గ్రెగరీ గుర్తింపు తెచ్చుకున్నారు.
నవంబరు 28న వాటికన్ సిటీల్లో జరిగే కార్యక్రమాల్లో కార్డినల్స్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.

Add new comment

1 + 0 =