కష్టాలలో ఉన్నవారికి చిన్న సహాయంకూడా ఎంతో ఊరటనిస్తుంది

దయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందుదురుదయామయులు ధన్యులు, వారు దేవుని దయను పొందుదురు

కష్టాలలో ఉన్నవారికి చిన్న సహాయంకూడా ఎంతో ఊరటనిస్తుంది

కష్టకాలంలో చిన్న సహాయమైనా ఎంతో విలువైనది. ఈ విషయం పాపల్ అల్మొనెర్ వారికి బాగా తెలుసు.

కార్డినల్ కొన్రాడ్ రెండు కన్యస్త్రీల గృహాలను సందర్శించారు. ఈ గృహాలలో ఉన్న కన్యస్త్రీలలో అధిక శాతం మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు.
కరోనా ఉన్నందున,  వారందరు స్వీయ నిర్బంధంలో ఉన్నారు. సెయింట్ కామిల్స్ మరియు అంజిలీక్ సిస్టర్స్ అఫ్ సెయింట్ పాల్ సంస్థలకు చెందిన ఈ కన్యస్త్రీలు స్వీయ నిర్బంధంలో ఉండగా కార్డినల్ కొన్రాడ్ వారిని సందర్శించి వారికి ఆహార ప్రధార్ధాలు ఇచ్చారు.
 
అదేవిధంగా 23 వ జాన్ పాపు గారి గృహానికి కూడా కార్డినల్ కొన్రాడ్ ఆహార పదార్ధాలు తీసుకు వెళ్లారు. అక్కడి వయో వృద్ధులైన గురువులకు, బిషప్పులకు ఈ ఆహార పదార్ధాలు తీసుకువెళ్లినట్లు తెలుస్తుంది. ఆ గృహంలో పని చేసే ముగ్గురు పనివారికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయినందున ఆ గృహంలోని వారు కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.

ఎందరో నిర్భాగ్యులు ఈ భయంకరమైన వ్యాధి బారిన పడి బాధ పడుతున్న సమయంలో మన చేతనైన చిన్న సహాయమైన అది ఎంతో విలువైనది. కనుక మనకు తోచిన సహాయం చెయ్యడంలో వెనుకాడకుండా, ప్రభువు చెప్పినట్టుగా మన పొరుగువారిని ప్రేమిద్దాం.

 

Article abstracted from : https://www.romereports.com/en/2020/03/24/papal-almoner-brings-food-supplies-to-quarantined-nuns/

Add new comment

17 + 2 =