కరోనా బారిన పడిన వారికి సహాయంగా నిలుస్తున్న ప్రతిఒక్కరిని ఫ్రాన్సిస్ పాపు గారు అభినందించి కృతఙ్ఞతలు తెలిపారు.

Thanks for people fighting CoronaThanks for people fighting Corona

కరోనా బారిన పడిన వారికి సహాయంగా నిలుస్తున్న ప్రతిఒక్కరిని ఫ్రాన్సిస్ పాపు గారు అభినందించి కృతఙ్ఞతలు తెలిపారు.

ఇటలీ, వాటికన్ లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల పర్యవసానంగా ఫ్రాన్సిస్ పాపు గారు అపోస్తలిక గ్రంధాలయం నుండే ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు.

తన సందేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ వారు ఎంత అనిశ్చిత పరిస్థితులలో ఉన్నారో తానూ అర్ధం చేసుకోగలను అన్నారు. వారికి ఎంతో దగ్గరగా ఉండి వారికి సహాయపడుతున్న వైద్య బృందానికి పాపు గారు కృతఙ్ఞతలు చెప్పారు.

కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడిన వారికోసం ప్రార్థిస్తున్న ప్రతిఒక్కరికి  కృతఙ్ఞతలు అని పాపు గారు అన్నారు.

పూర్వం పాపు గారు కోరిన విధంగా సిరియా నుండి వలస వెళ్తున్న వారికోసం ప్రార్ధించమని మరలా కోరారు.

ఈ కరోనా ఉపద్రవం కారణంగా  గ్రీస్ మరియు టర్కీ సరిహద్దులలో బాధల పడుతున్న వారిని మరిచిపోవొద్దు అని కోరుతున్నాను. వారి కోసం మనం ప్రార్ధించాలని వేడుకొంటున్నాను అని పాపు గారు అన్నారు.

ఈ బాధ, ఈ భయంకరమైన కరోనా వైరస్ ఉపద్రవం గ్రీస్ మరియు టర్కీ సరిహద్దులలో బాధల పడుతున్న సిరియా వారిని  మరిచిపోయేలా చెయ్యకూడదు అని ఆయన అన్నారు.

ప్రజలకు తన సందేశంలో పాపు గారు అష్టభాగ్యాలలోని నాల్గవదైన "నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు వారు సంతృప్తి పరచబడుదురు" అను దానిని ధ్యానించారు.

నీతి మార్గం నుండి దూరంగా ఉన్నవారిలోకూడా సత్యం కోసం దాహం కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు.

మనిషి ఎంత అవినీతిపరుడైనా, మంచి నుండి ఎంత దూరంగా ఉన్నా, వెలుగు కోసం అతని మనసులో ఆత్రుత కనిపిస్తుంది. అతని మనస్సు తప్పులతో నిండి ఉన్నా, అట్టడుగున సత్యం కోసం దాహం కనిపిస్తుంది. అదే దేవుని కోసం దాహం. అని పాపు గారు ప్రభోదించారు.

కనుక మనందరం నీతి కొరకు దాహం కలిగి, పాపు గారు చెప్పినట్లు, సిరియా ప్రజలకోసం ప్రార్ధించి, ప్రపంచంలో కరోనా వైరస్ బారిన పడిన వారికోసం మన చేతనైన సహాయం చెయ్యడానికి ముందుకు రావాలి.

Add new comment

7 + 1 =