ఓదార్పు ఆధ్యాత్మిక జీవితానికి ఒక అద్భుతమైన వరం - పొప్ ఫ్రాన్సిస్ గారు 

ఓదార్పు ఆధ్యాత్మిక జీవితానికి ఒక అద్భుతమైన వరం - పొప్ ఫ్రాన్సిస్ గారు 

పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ వారం  ఆధ్యాత్మిక ఓదార్పుపై దృష్టి కేంద్రీకరించి "వివేచన" పై తన ధ్యానాంశాలను  కొనసాగిస్తున్నారు. 
పొప్ ఫ్రాన్సిస్ గారు  "వివేచన" గురి౦చిన తన ప్రసంగాన్ని  కొనసాగిస్తూ, "ఓదార్పు అనేది మన మనసులను  స్పృశి౦చే ఒక ఆ౦తర౦గ ఉద్యమము" అని వివరించారు.  ఓదార్పును అనుభవి౦చేవారు " దేవుని సన్నిధి తమ చుట్టూ  కప్పివేయబడినట్లు" భావిస్తారు అని తెలిపారు. 

ఈ సందర్భముగా  అగస్టీన్, ఫ్రాన్సిస్, లయోలాకు చెందిన ఇగ్నేషియస్, ఎడిత్ స్టెయిన్ (సెయింట్ థెరిసా బెనెడిక్టా ఆఫ్ ది క్రాస్) వంటి గురువుల  జీవితాల్లో ఓదార్పు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. 

ఓదార్పును అనేది  పరిశుద్ధాత్మ ఇచ్చిన బహుమానమని, అది "బాధను తొలగిస్తునే   దేవునితో పరిచయాన్ని పెంపొందిస్తుంది " అని పొప్ ఫ్రాన్సిస్ గారు  అన్నారు. అయితే, పోప్ ఫ్రాన్సిస్ అబద్ధపు మాటల ఓదార్పుల ప్రమాదాల గురి౦చి కూడా ప్రజలను హెచ్చరించారు.    
 

Add new comment

1 + 4 =