ఒకరు చేసే పనిని బట్టి వారి విలువను నిర్ణయించకూడదు

సందేశంపోప్ ఫ్రాన్సిస్

పని వద్ద ప్రమాదాలకు వ్యతిరేకంగా నినదించే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్‌తో ఫ్రాన్సిస్ పాపు గారు సమావేశమయ్యారు. ఇది 1933లో ఇటలీ దేశంలో స్థాపించబడిన సంస్థ. త్రోవవే సంస్కృతి మహిళలను కార్యాలయంలో మరియు వెలుపల మినహాయించిందని పోప్ వారికి చెప్పారు.

గర్భం దాల్చుతుందనే భయంతో స్త్రీలను ముందస్తుగా తిరస్కరించడం జరుగుతుంది. "పని విషయంలో ఒక స్త్రీ తక్కువ నమ్మదగినది ఎందుకంటే ఆమె గర్భం దాలుస్తుంది అనే అపోహలో నేటి సమాజం ఉంది." మరియు వ్యక్తులను పనులకు నియమించే వ్యక్తి ఒక స్త్రీ కనబడినప్పుడు ఆమె పనిని వదిలివేస్తే బాగుంటుంది ఎందుకంటే ఆమె గర్భం దాలిస్తే పని చేసే స్థోమత ఆమెకు తగ్గుతుందనే ఆలోచనలో ఉంటాడు. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాలి అని పాపు గారు పిలుపునిచ్చారు.

ఒకరు ఎంత పని చేస్తున్నారో దానిపై వారి విలువను ఆధారం చేసుకునే సంస్కృతిని కూడా పాపు గారు ఖండించారు. మరియు వర్క్‌ఫోర్స్‌లో ఏకీకృతం కావడానికి కష్టపడుతున్న వ్యక్తులను మినహాయించినందుకు ఆయన విచారం వ్యక్తం చేశాడు.

సమావేశం చివరిగా కార్మికుల పోషకుడైన పునీత జోజప్పగారి కాపుదలలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్‌ నడవాలని ఆయన ఆకాంక్షించారు.

Add new comment

5 + 15 =