ఎవరి బాధలనుండి వారే బైట పడతారులే అనుకునే తత్వం క్రైస్తవులమైన మనకు ఉండకూడదు: ఫ్రాన్సిస్ పాపు గారు

Sufferings ఇతరులు పడే కష్టాలను క్రైస్తవులు విస్మరించరు అనే సత్యాన్ని పాపు గారు చాటారు

ఎవరి బాధలనుండి వారే బైట పడతారులే అనుకునే తత్వం క్రైస్తవులమైన మనకు ఉండకూడదు: ఫ్రాన్సిస్ పాపు గారు

 

త్రికాల జపములను ప్రార్ధించడం మరియు ఆ సమయంలో ప్రజలను ప్రత్యక్షంగా సందర్శించి వారికి తన ఆశీర్వాదాలు అందించడం పాపు గారు ఈ కరోనా సమయంలో తప్పక చేస్తున్న పని.

గత ఆదివారం ప్రజలకు తన సందేశంలో పాపు గారు ఐదు రొట్టెలు, రెండు చేపలను ఐదు వేల మందికి పంచిన క్రీస్తు ప్రభుని అద్భుతం లోని నిగూడ అర్ధాన్ని వివరించారు. దేవుడు తాను సృష్టించిన ఈ సృష్టి పై తనకున్న ప్రేమను ఈ అద్భుతం ద్వారా చూపించారని, ఈ వివరం క్రైస్తవులకు ఇతరులకు మధ్య వ్యత్యాసాన్ని చూపిస్తందని ఆయన అన్నారు.

ఇతరుల బాధ్యతను స్వీకరించే వివరం, ఇతరుల బాధలను విస్మరించకుండా ఉండే వివరం ఉండాలి, ఎవరి బాధలనుండి వారే బైట పడతారులే అనుకునే తత్వం క్రైస్తవులమైన మనకు ఉండకూడదు అని ఆయన ప్రబోధించారు.

ప్రార్ధన అనంతరం పాపు గారు కూడా సరిగ్గా ఇదే పని చేసారు. ఇతరులు పడే కష్టాలను క్రైస్తవులు విస్మరించరు అనే సత్యాన్ని పాపు గారు చాటారు. నికరాగువా లోని మనాగువా దేవాలయాన్ని కూల్చివేయడం గూర్చి ఆయన ప్రస్తావించారు.

నికరాగువా లోని సహోదరి సహోదరులతో నా ప్రార్ధనలు ఎప్పుడు ఉంటాయి. అక్కడ ధ్వంసము చెయ్యబడ్డ దేవాలయం, అందులోని క్రీస్తు స్వరూపం అన్నిటిని నేను నా ప్రార్థనలలో ఉంచుతున్నాను. అక్కడ బాధలు అనుభవిస్తున్న కథోలికులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అని ఆయన అన్నారు.

కరోనా మహమ్మారి గురించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న పాపు గారు ఆర్ధిక ఇబ్బందులతో బాధ పడుతున్న కుటుంబాలకు తన సానుభూతిని తెలిపారు.

రోము నగరంలో ఎండ వేడిమి అధికమౌతున్నా, వందల మంది విశ్వాసులు పాపు గారి సందేశం కోసం రోము లోని అపోస్తలిక భవనం వద్ద చేరారు.

Add new comment

18 + 1 =