Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ఎప్పుడు వెనుకకు తగ్గాలో తెలిసినవాడే మంచి తండ్రి - పోప్ ఫ్రాన్సిస్
ఎప్పుడు వెనుకకు తగ్గాలో తెలిసినవాడే మంచి తండ్రి - పోప్ ఫ్రాన్సిస్
వాటికన్ వార్తా పత్రిక వారికి ఇచ్చిన ఒక సందేశంలో నేటి సమాజంలో ఒక తండ్రి పాత్రకు ఉన్న విశిష్టతను మరియు ప్రాముఖ్యాన్ని వివరించారు.
1. భవిష్యత్తు లో తండ్రులు కానున్న వారికి
భవిష్యత్తులో తండ్రులు కానున్న నేటి యువతకు సందేశాన్ని ఇస్తూ వారి తల్లిదండ్రులు ఎటువంటి వారు, భవిష్యత్తులో వీరు ఎటువంటి తల్లిదండ్రులు గా ఉండాలని కోరుకుంటున్నారు అని ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి ఆయన అన్నారు.
తండ్రి అనే హోదా వారికి కాకతాళీయంగా వచ్చినది కాకూడదు, తండ్రితనంలో అర్ధాన్ని తెలుసుకొని ఒకరిని ఎలా ప్రేమించాలి, తన పై ఆధారపడి వారి భాద్యతను ఎలా స్వీకరించాలి అనే విషయాలను తెలుసుకోవాలి అని పాపు గారు వివరించారు.
2. బాధ్యతను నేర్పించుట
పిల్లలు తమ బాధ్యతలను స్వీకరించే విధంగా పెంచడం, వారి స్వాతంత్య్రాన్ని సక్రమంగా ఉపయోగించుకొనే విధంగా తయారు కావడం, తమపై ఆధార పది ఉన్న వారి బాధ్యతను స్వీకరించడం వంటివి నేర్పించడం ఒక మంచి తండ్రి యొక్క బాధ్యత అని పాపు గారు అభిప్రాయం పడ్డారు.
కానీ అది సులభమైన పని కాదని ఆయన అన్నారు.
ప్రేమ అంటే ఇతరుల పట్ల మన శ్రద్ద ను చూపించడం. అని అన్నారు.
3. అపజయాన్ని అధికమించడం
అన్ని సజావుగా ఉంటాయి, అంత మంచిగా జరుగుతుంది అని చెప్పేవాడు నిజమైన తండ్రి కాదు. క్లిష్టమైన పరిస్థితులలోనుండి అపజయాల నుండి ధైర్యంగా మరియు గౌరవప్రదంగా బైట పడే ఆత్మ స్థిర్యాన్ని నేర్పించేవాడే నిజమైన తండ్రి అని పాపు గారు అన్నారు
4. ఎప్పుడు వెనుకకు తగ్గాలో తెలుసుకొనుట
పిల్లలు పెరుగుతుంటే వారి దారి నుండి తప్పుకొని, ఎప్పుడు వెనుకకు తగ్గాలో తెలిసినవాడే మంచి తండ్రి అని పాపు గారు అభిప్రాయ పడ్డారు.
పిల్లలు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి, తమ నిర్ణయాలు స్వంతగా తీసుకోవడానికి, తమ జీవితాలను తమ స్వంతగా నడుపుకోవడానికి వారికి అవకాశం ఉండేలా మనం కొన్ని సార్లు వెనకకు తగ్గాలని పాపు గారు అన్నారు.
కథోలిక సమాజంలో కూడా ఇటువంటి సిద్ధాంతాలను అలవర్చుకోవాలని పాపు గారు అభిప్రాయపడ్డారు. తండ్రి స్థానంలో ఉండి తిరుసభ విశ్వాసులను దైవ మార్గంలో నడిపించాలని ఆయన అన్నారు.
Add new comment