ఉక్రెయిన్ లో యుద్ధాన్ని నివారించడానికి రాజకీయ నాయకులు కృషి చెయ్యాలి - ఫ్రాన్సిస్ పాపు గారు

ఉక్రెయిన్ లో యుద్ధంఫ్రాన్సిస్ పాపు గారు

ఉక్రెయిన్ లో యుద్ధాన్ని నివారించడానికి రాజకీయ నాయకులు కృషి చెయ్యాలి - ఫ్రాన్సిస్ పాపు గారు 

ఉక్రెయిన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని గూర్చి ఫ్రాన్సిస్ పాపు గారు స్పందించారు. ఆయన విశ్వాసులకు ఇచ్చిన సందేశంలో ఈ అంశాన్ని గూర్చి ప్రస్తావించారు. 

పాపు గారి సందేశం క్లుప్తంగా:

"ఉక్రెయిన్‌లో పరిస్థితి దిగజారుతున్నందున నా హృదయం చాలా బాధగా ఉంది. గత వారాల్లో దౌత్యపరమైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ఆందోళనకరమైన దృశ్యాలు పెరుగుతున్నాయి. నాలాగే, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు వేదన మరియు ఆందోళన చెందుతున్నారు. మరోసారి, ఒక్కరి ప్రయోజనం కోసం అందరి శాంతికి ఆటంకం కలుగుతుంది . ఈ సందర్భంగా రాజకీయ బాధ్యతలు కలిగిన వారికి నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. శాంతి దేవుడైన ఆ తండ్రి ముందు వారు మనస్సాక్షిని పరీక్షిచుకోవాలని నేను కోరుకుంటున్నాను.  మన తండ్రి శాంతికి  దేవుడు, యుద్ధానికి  కాదు.  మనం అన్నదమ్ములుగా ఉండాలనీ, శత్రువులుగా ఉండకూడదని కోరుకుంటున్నారు. దేశాల మధ్య సహజీవనానికి విఘాతం కలిగించి, అంతర్జాతీయ చట్టాలను దెబ్బతీసి, ప్రజలకు మరింత బాధ కలిగించే చర్యలను మానుకోవాలని నేను అన్ని పార్టీలను కోరుతున్నాను.

హింస యొక్క దౌర్జన్యమైన సున్నితత్వానికి మనం దేవుని ఆయుధాలతో ప్రతిస్పందించాలని యేసు ప్రభువు మనకు బోధించారు . ప్రార్థన మరియు ఉపవాసంతో ఈ మార్చి 2, విభూది బుధవారం, శాంతి కోసం ఉపవాస దినంగా పాటించాలని నేను ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాను. నేను ప్రత్యేక విధంగా, విశ్వాసులను ప్రోత్సహిస్తున్నాను, తద్వారా వారు ప్రార్థన మరియు ఉపవాసాలకు తమను తాము తీవ్రంగా అంకితం చేసుకోవాలి. శాంతికి తల్లి అయిన ఆ మరియతల్లి  ప్రపంచాన్ని యుద్ధం యొక్క మూర్ఖత్వం నుండి కాపాడుతుంది."

Add new comment

1 + 2 =