ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించాలని పొప్ ఫ్రాన్సిస్ మరోసారి పిలుపునిచ్చారు

 కైవ్ శివారు బుచాలో పౌరుల ఊచకోతపై పోప్ ఫ్రాన్సిస్ విచారం వ్యక్తం చేశారు.ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించాలని పొప్ ఫ్రాన్సిస్ మరోసారి పిలుపునిచ్చారు.

మంగళవారం బుచా పట్టణం నుండి ఉక్రెయిన్ జెండాను అందుకున్నట్లు పోప్ తెలిపారు. తర్వాత యుద్ధంలో తడిసిన ఆ జెండాను విప్పి, అందరికీ కనిపించేలా దానిని పట్టుకుని, "యుద్ధం నుండి, బలిదానం చేయబడిన బుచా నగరం నుండి ఇది వచ్చింది అని పొప్ ఫ్రాన్సిస్ చెప్పారు .

బుచా, కైవ్‌కు వాయువ్యంగా ఉన్న సబర్బన్ పట్టణం, ఫిబ్రవరి 27  రష్యన్ దళాల  ఆధీనంలో ఉంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరిగిన నెలరోజులకు తర్వాత  కైవ్ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఉక్రెయిన్. బుచా పట్టణంలో దాదాపు 320 మంది పౌరులను చంపినట్టు ఆ నగర మేయర్ తెలిపారు.బుచాలో సామూహిక సమాధులను చూసిన తర్వాత రష్యా యుద్ధానికి ముగింపు పలకాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) పిలుపునిచ్చారు.

ఈ సందర్భముగా పోప్ ఫ్రాన్సిస్ ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించాలని తన విజ్ఞప్తిని మరోసారి పునరుద్ధరించారు. వాటికన్ సిటీకి వచ్చిన ఆరుగురు  ఉక్రెయిన్ చిన్నారులను ఆహ్వానించిన పోప్ ఫ్రాన్సిస్ వారు తీసుకొచ్చిన జెండాను తీసుకుని ముద్దాడారు.“ఈ యుద్ధం ఆగాలి! ఈ ఉద్దేశం కోసం దేవుడిని అడగడానికి ఒక క్షణం మౌనంగా ప్రార్థించమని పొప్ ఫ్రాన్సిస్  అందరినీ కోరారు. ప్రజలందరూ ఉక్రెయిన్ ప్రజల కోసం ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.

 

Add new comment

4 + 16 =