ఈ సృష్టి యొక్క విశిష్టత మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మానవ జాతి ఉనికి యొక్క రహస్యాన్ని గూర్చి ఆలోచింపజేస్తుంది: ఫ్రాన్సిస్ పాపు గారు

family prayerదేవునితో మన సంబంధం ఎంతో పవిత్రమైనది

ఈ సృష్టి యొక్క విశిష్టత మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మానవ జాతి ఉనికి యొక్క రహస్యాన్ని గూర్చి ఆలోచింపజేస్తుంది: ఫ్రాన్సిస్ పాపు గారు

విశ్వాసులకు తన సత్యోపదేసంలో భాగంగా ఫ్రాన్సిస్ పోప్ గారు ప్రార్ధన అను అంశం గురించి తన సందేశాన్ని కొనసాగించారు. మానవ మనసునకు ఆశ్చర్యం కలింగించే ఈ సృష్టి రహస్యాలను గూర్చి అయన ధ్యానించారు.

కొన్ని సార్లు గుర్తింపు లేనట్లుగా అనిపించినా మనుషులు ప్రాముఖ్యత లేని వారు మాత్రం కాదు. నిజానికి స్త్రీ పురుషులు దేవుని బిడ్డలే. విశ్వాసులమైన మనం ఈ జీవితం ఆ దేవుని బహుమానమని ప్రార్ధన ద్వారా కనుగొనగలం.

పాపు గారు సందేశం (క్లుప్తంగా)

ప్రార్ధన గూర్చిన మనం సత్యోపదేశంలో నేడు సృష్టి యొక్క రహస్యాన్ని గూర్చి ధ్యానించుకుందాం. బైబిల్ లోని మొదటి అధ్యాయాలు గమనిస్తే మనకు సృష్టి యొక్క అందానికి, సృష్టిలోని మంచితనానికి కృతజ్ఞతా స్తుతులు ప్రతిబింబిస్తాయి. సృష్టి లోని అద్భుతాలకు మానవ హృదయం ఆశ్చర్యం కనిపిస్తుంది, తద్వారా ప్రార్ధించాలనే వాంఛ కనిపిస్తుంది.

ఈ సృష్టి యొక్క విశిష్టత మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ మానవ జాతి ఉనికి యొక్క రహస్యాన్ని గూర్చి ఆలోచింపజేస్తుంది. మానవులమైన మనం గుర్తింపు లేని వారముగా  అనిపించినా, మనం ప్రాముఖ్యత లేని వారము మాత్రం కాదు. మనం ఎదో అలా సృష్టించబడలేదని ప్రార్ధన ధ్రువీకరిస్తుంది. దేవునితో మన సంబంధం ఎంతో పవిత్రమైనదని ప్రార్ధన తెలుపుతుంది.

స్త్రీ పురుషులు సూన్యంతో సమానులైనా, వారు రాజాధి రాజైన ఆ దేవుని బిడ్డలు. జీవితంలో కష్టాలు, శ్రమల మధ్య మన నిరీక్షణకు బలం ప్రార్ధన వలననే దొరుకుతుంది. ప్రార్ధించు విశ్వాసుల ప్రార్ధన వల్ల ఈ జీవితం ఆ దేవుని బహుమానమని ఇతరులు గ్రహించగలరు. ప్రార్ధనలోని నిరీక్షణ నిరాశను తొలగిస్తుంది. ప్రార్ధనలోని  ప్రేమకు మరణం కూడా అవరోధం కాదు.

మనం ఇంకా సజీవుల లెక్కలో ఉన్నందుకు మన పరలోక తండ్రికి కృతఙ్ఞతలు తెలుపుకుందాం.

మనం క్రీస్తు మోక్షారోహణకు సంసిద్దులమౌతున్న ఈ తరుణంలో మీ పై మీ కుటుంబాలపై ఆ ఉత్థాన క్రీస్తుని శాంతి, సంతోషాలు ప్రోక్షింపబడాలని ప్రార్ధిస్తున్నాను. 

 

Article abstracted from: https://www.romereports.com/en/2020/05/20/pope-reflects-on-beauty-of-creation-which-can-awaken-a-sense-of-wonder/

Add new comment

11 + 6 =