ఈ భూగ్రహం పట్ల మనకు శ్రద్ద లేకపోతే మనుషులకు భౌతిక ఎదుగుదల అసాధ్యం: పోప్ ఫ్రాన్సిస్

Care for natureప్రకృతిని, వ్యాధిగ్రస్తులను, అవసరతలలో ఉన్న వారిని ఆదుకోవడమే నిజమైన క్రైస్తవత్వం

ఈ భూగ్రహం పట్ల మనకు శ్రద్ద లేకపోతే మనుషులకు భౌతిక ఎదుగుదల అసాధ్యం: పోప్ ఫ్రాన్సిస్

ఈ ప్రకృతిలో దేవుడు సృష్టించిన వాటిని మనం దుర్వినియోగం చేస్తున్నామని, తద్వారా సృష్టికే కాక మానవులకు అందరికి అది నష్టం కలిగిస్తుందని ఫ్రాన్సిస్ పోప్ గారు మరొక్క సరి విశ్వాసులకు గుర్తు చేసారు.

సెప్టెంబర్ 16 న ప్రజలకు ఇచ్చిన సందేశంలో ఆయన మాట్లాడుతూ, ఎవరైతే ప్రకృతిని, ప్రకృతిలోని వనరులను దుర్వినియోగ పరుస్తారో, వారు తమ తోటి వారిని బానిసలుగా చేస్తున్నట్లే అని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఎవరైతే ప్రకృతిని కాపాడలేరో, వారు సాటి మనుషులను గూర్చి కూడా ఆలోచించలేరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలని ఆయన అన్నారు.

తన సత్యోపదేశ సందేశంలో కరోనా మహమ్మారి సమసిపోయిన అనంతరం ఈ భూగ్రహాన్ని ప్రక్షాళన చెయ్యడం తెలుసుకోవాలని ఆయన సూచించారు. అందుకు గాను మనం ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉండాలని, దీనులు, వ్యాధిగ్రస్తులు మరియు వయోవృద్ధులకు సహాయం చేసే వారికి మన చేయూతను అందించాలని ఆయన ప్రభోదించారు.

వ్యాధిగ్రస్తులను, అవసరతలలో ఉన్న వారిని, వెలివెయ్యబడిన వారిని ఆదుకోవడమే మానవత్వమని, అదే నిజమైన క్రైస్తవత్వమని ఆయన హితవు పలికారు.

చింతన మరియు సంరక్షణ అనునవి మనకు ఉండవలసిన రెండు ముఖ్య గుణాలని, వీటి ద్వారా మనుషులకు, ఈ సృష్టికి మధ్య ఉన్న బాంధవ్యాన్ని సమతులం చెయ్యగలము ఆయన అన్నారు.

సృష్టి తో బాంధవ్యం మనలను ఉమ్మడి గృహమైన భూగ్రహానికి, జీవానికి, నిరీక్షణకు సంరక్షకులనుగా చేస్తుందని ఆయన గుర్తు చేసారు.

ఈ భూగ్రహం పట్ల మనకు శ్రద్ద లేకపోతే మనుషులకు భౌతిక ఎదుగుదల అసాధ్యమని ఆయన వొక్కాణించారు.

ఇకనుండైనా మనం మన దిశను మార్చుకొని ఈ భూమిని గూర్చి, మన పొరుగు వారిని గూర్చి శ్రద్ద తీసుకోవడం ప్రారంభించాలని విశ్వాసులను ఆయన కోరారు.

Add new comment

12 + 2 =