ఈ ప్రపంచానికి శాంతిని ప్రోత్సహించే "స్వచ్ఛ మైన  రాజకీయాలు"  అవసరం పొప్ ఫ్రాన్సిస్ గారు 

ఈ ప్రపంచానికి శాంతిని ప్రోత్సహించే "స్వచ్ఛ మైన  రాజకీయాలు"  అవసరం పొప్ ఫ్రాన్సిస్ గారు 

 

ఇటాలియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ స్పాన్సర్ చేసిన "ప్రోజెట్టో పొలికోరో"(Progetto Policoro) యొక్క సుమారు 150 మంది సహకార సంఘాల ప్రతినిధులతో వాటికన్ లో పోప్ ఫ్రాన్సిస్ గారు సమావేశమయ్యారు.  యుద్ధంతో దెబ్బ తింటున్నా ఈ కాలంలో "'స్వచ్ఛ మైన (మంచి) రాజకీయాలు "  యొక్క  అవసరాన్ని తెలియజేసారు. ఈ బృందం శాంతిపై సామాజిక మరియు రాజకీయ శిక్షణా కోర్సుకు హాజరవుతోంది. ఈ సంఘాల ముఖ్యమైన పని  వృత్తిపరమైన  శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం, సహకార సంఘాలను ప్రోత్సహించడం మరియు "కమ్యూనిటీ యానిమేటర్లు" వంటి మధ్యవర్తులను సృష్టించడం.

నిరుద్యోగ, తక్కువ ఉపాధి పొందుతున్న యువతకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన శ్రీసభ  ప్రాయోజిత ప్రాజెక్టులో పాల్గొన్న ఇటాలియన్ యువకులను పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ సందర్భముగా  ప్రశంసించారు. వారి భాగస్వామ్యం ప్రజల అవసరాలకు దగ్గరగా ఉన్న "మెరుగైన రాజకీయాలకు" దోహదం చేస్తుందని, తద్వారా ప్రపంచంలో శాంతిని నిర్మించడానికి దోహదం చేస్తుందని అన్నారు.

ప్రజల మాట విని, శాంతిని పెంపొందించే 'స్వచ్ఛ మైన  రాజకీయాలు' ఈ రోజులలో  అత్యంత  అత్యవసరమని పోప్  ఫ్రాన్సిస్ గారు పేర్కొన్నారు. యుద్ధం - ఒక రాజకీయాల వైఫల్యం అని  ఈ సందర్భముగా ఆయన నొక్కి చెప్పారు. 

బైబిల్లో ఉన్న ఇశ్రాయేలు రాజు అహాబు మరియు అతని భార్య జెజెబెల్ ల కుటిల  రాజకీయాలను  ఉదాహరణగా పేర్కొన్నారు. మరియు  సెయింట్ ఆంబ్రోస్ మాటలను గుర్తు చేసుకుంటూ  పోప్ ఫ్రాన్సిస్ గారు ఇలా నొక్కిచెప్పారు, "అధికారాన్ని ఒక సేవగా కాకుండా ఆధిపత్యంగా ఉపయోగిస్తే అది మంచి   రాజకీయం అనిపించుకోదు అని, ఆధిపత్యంగా ఉపయోగించే రాజకీయం పేదలపై భారం పడుతుందని ,భూమిని దోపిడీ చేస్తుంది మరియు  యుద్దానికి పునాది వేస్తుందని తెలిపారు. 

పొప్ ఫ్రాన్సిస్ గారు యాకోబు కుమారుడైన యోసేపు  ఉదాహరణను తీసుకున్నారు "వ్యక్తిగతంగా అన్యాయాన్ని అనుభవించిన యోసేపు తన స్వప్రయోజనాన్నే కాకుండా ప్రజల ప్రయోజనాలను కోరుకుంటాడు, ప్రజల  శ్రేయస్సు కోసం వ్యక్తిగతంగా డబ్బు చెల్లిస్తాడు, శాంతి స్థాపకుడిగా మారతాడు, సమాజాన్ని నవీకరించగల సంబంధాలను ఏర్పరిచాడు " అని పొప్ ఫ్రాన్సిస్ గారు తెలిపారు.

పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ,  రాజకీయ కార్యకలాపాలకు ఏ రకమైన "ఆధ్యాత్మికత" తోడ్పడాలో బాగా అర్థం చేసుకోవడానికి  ఈ రెండు బైబిల్ ఉదాహరణలు మనకు సహాయపడతాయి అని అన్నారు.  

Add new comment

8 + 10 =