ఈ ఊచకోతను ఆపండి! - పోప్ ఫ్రాన్సిస్

ఈ ఊచకోతను ఆపండి!
 
మార్చి 13 ఆదివారం నాడు పోప్ ఫ్రాన్సిస్ తన ఏంజెలస్ లో ప్రసంగం  సందర్భంగా యుక్రెయిన్ మీద జరుగుతున్న  దాడిని ఉద్దేశించి  మాట్లాడారు.
పిల్లలు, అమాయకులు మరియు పౌరులను చంపడం  అనాగరికత అని అన్నారు. యుక్రెయిన్ లో నగరాలు స్మశానవాటికలుగా మారుతున్నాయని, ఇది ఆమోదించలేని సాయుధ దురాక్రమణ  అని, నిస్సందేహంగా దానికి ముగింపు పలకాలని కోరారు.
దేవుడు శాంతికి మాత్రమే దేవుడు, అతను యుద్ధానికి  మరియు హింసకు మద్దతు ఇచ్చేవారు కాదు అని అన్నారు.  యుక్రెయిన్ లో శాంతి నెలకొనేలా ప్రార్థనలు చేయాలనీ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
 

Add new comment

2 + 2 =