ఆసుపత్రులు ధనార్జనను పక్కన పెట్టి సేవాభావంతో ప్రజలకు సేవ చెయ్యాలి: పోప్ ఫ్రాన్సిస్

Health Industryడబ్బు మరియు ఆర్ధిక వ్యవహారాలు ఆరోగ్య సంరక్షణ రంగంలోనికి రాకూడదు

ఆసుపత్రులు ధనార్జనను పక్కన పెట్టి సేవాభావంతో ప్రజలకు సేవ చెయ్యాలి: పోప్ ఫ్రాన్సిస్

ఆసుపత్రులు ధనార్జనను పక్కన పెట్టి సేవాభావంతో నిరుపేదలైన వ్యాధిగ్రస్తులకు సేవ చెయ్యాలని, ఎందుకంటే రోగితో ఉండే సంబంధం కూడా అతని రోగానికి మందులా పని చేస్తుందని ఫ్రాన్సిస్ పోప్ గారు అభిప్రాయం పడ్డారు.

వ్యాధిగ్రస్తులతో సంబంధాలను దెబ్బతీసే స్థాయికి ఆర్ధిక వ్యవహారాలు ఉండకూడదు. డబ్బు మరియు ఆర్ధిక వ్యవహారాలు ఆరోగ్య సంరక్షణ రంగంలోనికి రాకూడదు అని పోప్ గారు అన్నారు.

ఇంటర్నేషనల్ గైనకాలోజిక్ క్యాన్సర్ సొసైటీ వారు వాటికన్ నగరాన్ని సందర్శించి, ఫ్రాన్సిస్ పోప్ గారిని కలిసినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

స్త్రీల సంరక్షణ మరియు వారి మాతృత్వాన్ని కాపాడుతూ అనుదినం మేము వారి శారీరకంగా మరియు మానసికంగా బలాన్ని కలిగించాలని ప్రయత్నిస్తున్నాం అని ఇంటర్నేషనల్ గైనకాలోజిక్ క్యాన్సర్ సొసైటీ లోని ఒక సభ్యుడు అన్నారు.

ఈ బృందంలో క్యాన్సర్ నుండి కోలుకొని ఇప్పుడు రోగులకు పరిచెర్యలు చెయ్యడంలో తన జీవితాన్ని అంకితం చేసిన ఒక యువతిని చూసి పోప్ గారు ఎంతో ఆనందించి, ఆమెను అభినందించారు. 

Add new comment

2 + 0 =