ఆయుధాలు వీడి క్షమాగుణం కలిగి శాంతిని స్థాపించాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

Pope francisPope francis

ఆయుధాలు వీడి క్షమాగుణం కలిగి శాంతిని స్థాపించాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

ఆగమన కాలం లోని మొదటి ఆదివారపు దివ్య బలిపూజను  ఫ్రాన్సిస్ పాపు గారు కాంగోలీస్  కాథలిక్  ఛాప్లైన్సీ సభ వారితో జరుపుకొన్నారు.

పూజ లో తన ప్రసంగంలో వినిమయతత్వం వల్ల సమాజం లో వచ్చే దుష్ప్రభావాలను గూర్చి పాపు గారు వివరించారు.

వినిమయతత్వం అనేది విశ్వాసాన్ని వేరులతో సహా నాశనం చేస్తుంది. మన దగ్గర ఉన్న దాని బట్టి మన జీవితం ఉంటుందని మనం అనుకునేలా అది మనల్ని మభ్య పెడుతుంది. దీని కారణంగా మనం దేవుని మరియు మన సాటి వారిని, మన సహోదరులను కూడా మర్చిపోతాం" అని ఆయన అన్నారు.

ఆగమన కాలానికి ప్రార్ధన, దాతృత్వం అనేవి ఎంతో ముఖ్యమైన గుణాలని అని ఆయన ప్రభోదించారు.

మనం మనకున్న వాటితో సంతోషంగా ఉన్నాం అని మనల్ని మనం మోసం చేసుకోవడం మానివేయాలి. ఈ మాసం అంతా మనకు కళ్ళు మిరిమిట్లు గొలిపే కాంతులు కనిపిస్తాయి వాటి మాయలో పడిపోకుండా, ప్రార్ధన, ధాతృత్వంలో సమయాన్ని గడపండి. అది మనకు ఒక నిధి వంటిది." అని ఆయన హితవు పలికారు.

కాంగోలీస్ సభ వారు పాటలతో, నృత్యాలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు.

కాంగోలీస్ సభ వారి మాతృ దేశమైన కాంగో లో సమాధానం రావాలని, అక్కడివారు ఆయుధాలను వీడి క్షమా గుణంతో శాంతిని స్థాపించాలని ఆయన కోరారు.

అనువాదకర్త: అరవింద్ బండి 

 

Add new comment

2 + 3 =