ఆగమన కాలం మాకు సహాయపడుతుంది :పొప్ ఫ్రాన్సిస్

ఆదివారం  పోప్ ఫ్రాన్సిస్ అడ్వెంట్ సీజన్ యొక్క అర్ధాన్ని మరియు ప్రాముఖ్యతను వివరించడం జరిగినది .
యేసు ప్రభువు నిరంతరం మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్నారని  అడ్వెంట్ సీజన్ మనకు ఎలా గుర్తు చేస్తుందో ,అలాగే మన భవిష్యత్తును విశ్వాసంతో, ఆశతో చూడమని మనల్ని ప్రేరేపిస్తుందని ఆయన అన్నారు."యేసు రాకను స్వాగతించే సమయం ఇది అని తెలిపారు .
 సువార్త పఠనంలో, యేసు తన రాక కోసం “మెలకువగా” ఉండమని మనలను కోరుతున్నాడు.మెలకువగా ఉండడం అంటే ఒకరి కళ్ళను అక్షరాలా ఎప్పుడైనా తెరిచి ఉంచడం అని కాదు, కానీ సేవలో ఇతరుల ప్రయోజనం కోసం మనం సాయపడటం ద్వారా వారి  హృదయాన్ని “స్వేచ్ఛగా మరియు సరైన దిశలో నడిపించే వారము అవుతాము ” అని  పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
యేసు కోసం ఎదురుచూస్తున్న మన నిరీక్షణ కడవరకు సాగాలని ,ప్రభు యేసు మార్గం లో ప్రయాణించేటప్పుడు
అప్రమత్తత అవసరమని పోప్ అన్నారు.

Add new comment

1 + 1 =