Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
అసమానతలను రూపుమాపి, అన్యాన్ని తుడిచివేసి, ఆదిమ క్రైస్తవ సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలి
అసమానతలను రూపుమాపి, అన్యాన్ని తుడిచివేసి, ఆదిమ క్రైస్తవ సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలి
కరోనా ప్రబలుతున్న ఈ సమయంలో ఫ్రాన్సిస్ పాపు గారు దైవిక దయ ఆదివారాన్ని పురస్కరించుకొని తన నివాసాన్ని వదలి సస్సియా లోని పరిశుద్దాత్మ దేవాలయంలో దివ్య పూజాబలి అర్పించడానికి వెళ్లారు. ఈ దేవాలయం సెయింట్ పీటర్స్ బసిలికాకు కొద్దీ దూరంలో మాత్రమే ఉంది.
దైవిక దయ ఆదివారాన్ని ఇక్కడ జరిపే ఆనవాయితీని 2000 సంవత్సరంలో రెండవ జాన్ పాల్ పాపు గారు ప్రారంభించారు. పునీత ఫాస్టిన కోవాల్సక గారిని పునీతునిగా ప్రకటించిన అనంతరం ఈ ఆనవాయితీని ప్రారంభించారు. 20 వ శతాబ్దం మొదటిలో ఈయన దైవిక దయను గూర్చి ఎంతో విరివిగా ప్రచారం చేసారు.
గత ఆదివారం జరిగిన ఈ దివ్య బలిపూజలో పాపు గారి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు అయ్యారు. 2016 లో దైవిక దయను పురస్కరించుకొని జరిగిన జూబిలీ వేడుకలలో పాపు గారు ప్రస్తావించిన విషయాలను మరలా ఆయన ప్రస్తావించారు.
మన లెక్కలు సరిచేసే యజమానిగా కాక మన కోసం నిలబడే మన రక్షకునిగా తండ్రిని మనం చూడాలని తండ్రి కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు.
పూజాబలిలో ప్రసంగిస్తూ కరోనా మహమ్మారి విస్తరిస్తున్న ఈ సమయంలో మానవతా దృక్పధం తో స్పందించాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సమయంలో సంఘీభావంతో ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, అత్యవసర సమయాలలో ఒకరికొకరు సహాయం చేసుకోవాలని ఆయన కోరారు.
కరోనాకన్నా ప్రమాదకర వైరస్ స్వీయ ఉదాసీనత, నా జీవితం సుఖంగా ఉంటె అంతా సుఖంగా ఉంటుంది, నాకు మంచిగా ఉంటే అంతా మంచిగా ఉన్నట్టే అనే అపోహను ఈ వైరస్ కలిగిస్తుంది. ఈ ఆరోగ్య పరమైన అత్యవసర పరిస్థితులు ఎవరు తప్పించుకోలేరు, అందరు సమానులే అనే ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు, అందరు ఒకటే, అందరు సమానులే అని నిరూపిస్తుంది. అసమానతలను రూపుమాపి, అన్యాయాన్ని తుడిచివేసి, ఆదిమ క్రైస్తవ సంఘాన్ని ఆదర్శంగా తీసుకొని జీవించాలని పాపు గారు అన్నారు.
నిర్బంధం ప్రకటించనతర్వాత పాపు గారు తన గృహం నుండి బైటకు రావడం ఇది రెండవ సారి. సాన్ మార్సెల్లో లోని ఆశ్చర్యకర సిలువ వద్ద ప్రార్ధించడానికి మొదటిసారి కాగా, ఇది రెండవసారి. Article abstracted from: https://www.romereports.com/en/2020/04/20/pope-celebrates-divine-mercy-we-risk-being-sturck-by-a-worse-virus-selfish-indifference/
Add new comment