అత్యంత దురదృష్ట పరిస్థితులలో ఉన్నవారికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి, కరోనా విరుగుడు మందును వారికి ముందుగా అందజేయాలి: ఫ్రాన్సిస్ పాపు గారు

Poor peopleఅసమానతలన్నిటికి బైబిల్ గ్రంధం సమాధానం చెప్తుంది

అత్యంత దురదృష్ట పరిస్థితులలో ఉన్నవారికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి, కరోనా విరుగుడు మందును వారికి ముందుగా అందజేయాలి: ఫ్రాన్సిస్ పాపు గారు.

కరోనా వల్ల బైట పడుతున్న సామాజిక సమస్యలను గూర్చి ఫ్రాన్సిస్ పాపు గారు ధ్యానించడం కొనసాగించారు.

ఈ కరోనా మహమ్మారి వల్ల పేదల పరిస్థితి తేట తెల్లమైంది మరియు ఈ సమాజంలో ఉన్న అసమానతలు బైటికి కనిపించడం ప్రారంభించాయి అని పాపు గారు అన్నారు. ఎటువంటి అసమానతలు చూపించని ఈ కరోనా మనలో ఉన్న అసమానతలను బట్ట బయలు చేసింది అని ఆయన అభిప్రాయ పడ్డారు.

ఈ అసమానతలన్నిటికి బైబిల్ గ్రంధం సమాధానం చెప్తుందని, అది రాజకీయాలకో మారే భావ జాలమో కాదు. అది క్రీస్తు ప్రభువు తన జీవితం ద్వారా మనకు చూపిన దారి అని ఆయన ప్రభోదించారు.

క్రీస్తు ప్రభువు రోగగ్రస్తుల నడుమ, వెలివెయ్యబడిన పేదల నడుమ సంచరించారు. దేవుని దయాపూరిత ప్రేమను వారికి అందించారు. ఆయన వారితో సంచరించుచున్న కారణమున అనేక మార్లు  అనేక మంది ఆయనను పాపి అని, సాతాను సంబంధితుడని ఆయన పై అపనిందలు కూడా మోపారు. కానీ క్రీస్తు ప్రభువు వాటిని లెక్కచెయ్యకుండా పేదలకు, రోగగ్రస్తులకు దెగ్గరగా జీవించారు అని పాపు గారు గుర్తు చేసారు.

ఈ కరోనా అనేది ఒక సంక్షోభం, సంక్షోభం నుండి బైట పొందిన వారు మునుపటిలా ఉండరు. ఎంతో కష్టంతో బైట పడిన అనంతరం సామజిక, ఆర్ధిక పరిస్థితులను సరి చేసుకోవాలి. కనుక ఇప్పుడు మనకు ఎదో క్రొత్తది రూపొందించుకునే అవకాశం నేడు ఉంది. ఉదాహరణకు, పేదవారి సమగ్ర అభివృద్ధి కోసం క్రొత్తగా ఏదైనా చేసే అవకాశం మనకు ఇప్పుడు లభిస్తుంది అని ఆయన గుర్తు చేసారు.

అత్యంత దురదృష్ట పరిస్థితులలో ఉన్నవారికి ముఖ్య ప్రాధాన్యత ఇచ్చి, కరోనా విరుగుడు మందును వారికి ముందుగా అందజేయాలని పాపు గారు అభిప్రాయ పడ్డారు.

కరోనా విరుగుడు మందు ఒక దేశ ఆధీనంలోనో, లేక ధనవంతుల ఆధీనంలోనో ఉంటే అది దురదృష్టం అనే చెప్పుకోవాలి, అదే జరిగి, మరింతమంది  పేద వారు ప్రాణాలు కోల్పోతే, ఈ ప్రపంచ తీరు మార్చవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు.

చివరిగా, ఈ సంక్షోభ సమయంలో ప్రజలు పేదలకు సహాయం చేసే సంస్థలకు తమ ధనాన్ని దానం చేసి పేదలకోసం, వారి ప్రాణాలకోసం సహాయంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
 

 

Add new comment

2 + 8 =