అందరు సంఘీభావంతో కలిసి ఈ మహమ్మారి విసిరిన సవాళ్ళను ఎదుర్కోవాలి: పోప్ ఫ్రాన్సిస్

Solidarityఈ ప్రపంచానికి స్వస్థత మరియు నిరీక్షణ తీసుకురావడానికి మనం పిలువబడ్డాము

అందరు సంఘీభావంతో కలిసి ఈ మహమ్మారి విసిరిన సవాళ్ళను ఎదుర్కోవాలి: పోప్ ఫ్రాన్సిస్

సెప్టెంబర్ 23 న విశ్వాసులకు తన సత్యోపదేశ సందేశం లో ఫ్రాన్సిస్ పోప్ గారు కరోనా మహమ్మారి విసిరినా సవాళ్ళను అధికమించడానికి ఆవశ్యకమైన అసాధారణమైన సంఘీభావాన్ని గూర్చి వివరించారు.

 ఈ ప్రపంచానికి స్వస్థత మరియు నిరీక్షణకు తీసుకు వచ్చే విధంగా సమిష్టిగా కలిసి పని చెయ్యడానికి మనందరం పిలువబడ్డామని ఆయన వొక్కాణించారు.

పోప్ గారి సందేశం (క్లుప్తంగా)

ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక జీవితం పై కరోనా మహమ్మారి ప్రభావం పై కొనసాగుతున్న మన సత్యోపదేశ సందేశాలలో మన సహోదరులతో, మరి ముఖ్యంగా పేదలు, బలహీనులు మరియు వెలివెయ్య బడిన వారితో మనకు ఉండవలసిన సంఘీభావాన్ని గూర్చి ముచ్చటించుకున్నాము. వ్యక్తిగతంగానూ, ఒక సంఘం గాను మరియు విశ్వాసులమైన స్త్రీ పురుషులము గాను ఈ ప్రపంచానికి స్వస్థత మరియు నిరీక్షణ తీసుకురావడానికి మనం పిలువబడ్డాము. సంఘీభావం అంటే ఒక విధంగా సంబంధ బాంధవ్యాలనే చెప్పాలి. ఈ సంఘం లోని అతి చిన్న వర్గం నుండి అత్యున్నత వర్గం వరకు, ప్రతి కుటుంబము నుండి ఒక పరిపూర్ణ సంఘం వరకు ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్టమైన పాత్ర ఉంటుంది.

మన శరీరంలోని కొన్ని అవయవాలు తక్కువ ప్రాముఖ్యం ఉన్నవి అనిపించినా, అన్ని అవయవాలు సరిగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అని పునీత పౌలు గారు బోధించారు. అదే విధంగా ఈ లాక్ డౌన్ సమయంలో ఎందరో వ్యక్తులు, మరియు ఎన్నో సంఘాలు ఇతరులకు సహాయం చెయ్యడానికి ముందుకు వచ్చారు. రానున్న రోజులలో కూడా ప్రజలలో ఈ సంఘీభావం మరియు సంబంధ బాంధవ్యాలు మరింత పెరిగి, ఈ పరీక్షా కాలం నుండి మనందరం కలిసికట్టుగా బయటపడాలని కోరుకుంటున్నాను.

Add new comment

9 + 7 =