TCBC ప్రాంతీయ దళిత పాలసి - చర్చావేదిక

దళిత పాలసిచర్చావేదిక

TCBC ప్రాంతీయ దళిత పాలసి - చర్చావేదిక

ఏలూరు మేత్రాసనం, సెయింట్ జోసఫ్స్ దంత వైద్య కళాశాలలో జరుగుతున్నTCBC విభాగాల చర్చావేదిక లో భాగంగా 23 ఫిబ్రవరి 2022 న విజయవాడ మేత్రాసన దళిత విభాగ కార్యదర్శి శ్రీ అశోక్ కుమార్ కోరుకొండ గారు ప్రాంతీయ దళిత (పాలసీ) సాధికారత పత్రం దాని విధి, విధానాల గురించి సభకు వివరించారు. భారత దేశంలో 12 మిలియన్ల ప్రజలు ఉంటె వారిలో ఒక కోటి ఇరవై వేల మంది దళితులూ ఉన్నారు. 21 రాష్ట్రాలలో దళితులు ఆర్ధిక, సామాజిక అన్యాయానికి గురి అవుతున్నారని ఆయన తెలిపారు. అందరు సంఘీభావంతో పని చేస్తే దళిత కథోలికులు సంతోషంగా జీవించగలరని, తమ హక్కులను పొందగలరని ఆయన వివరించారు.

దళిత కథోలికులకు హక్కులు కల్పించాలని CBCI జాతీయ విభాగం వారు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. CBCI దళిత కథోలికుల అభ్యుదయం కోసం ఎంతో పోరాటం చేసినా క్షేత్ర స్థాయిలో అనుసరించపోవడం బాధాకరమని తెలియజేసారు. రాజ్యాంగం దళిత కథోలికులకు ఇచ్చిన హక్కులను గురించి సభకు తెలియజేసారు . రంగనాధ్ మిశ్రా కమిటీ వారు ఇచ్చిన నివేదికను సభికులకు వివరించారు. 

దళిత కథోలికులను ఆర్ధికంగా, విద్యాపరంగా బలపరచ వలసిన బాధ్యత శ్రీసభపై ఉందని, ముఖ్యంగా దళిత కథోలిక యువతను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. యువతకు విద్యాపరంగా వసతులను ఏర్పాటు చెయ్యాలి. ప్రతి మేత్రాసనంలో help desk లను ఏర్పాటు చేసి, యువత అవసరాలను తెలుసుకొని వారికి చేయూతనివ్వాలని బాలికల మరియు స్త్రీల సాధికారత కోసం శ్రీసభ పాటు పడాలని ఆయన అభిప్రాయ పడ్డారు.

శ్రీ అశోక్ కుమార్ గారు దళిత సాధికారణ గురించి వివరించిన విషయాలు మరియు వివరణ విధానాన్ని ఏలూరు పీఠాధిపతులు మహా పూజ్య. పొలిమెర జయరావు గారు అభినందించి శ్రీ అశోక్ కుమార్ గారికి కృతఙ్ఞతలు తెలిపారు.

Add new comment

4 + 9 =