HASSS వారి సేవ

ఉన్నచోట ఉపాధి లేక పొట్ట కూటికోసం కడుపు చేత పట్టుకుని పని కోసం వేల కిలోమీటర్లు వచ్చిన వలస కార్మికులు కష్టాల జీవనం సాగిస్తున్నారు. 

 రెక్కడితే గాని డొక్కాడని కార్మికులు కష్టాల నడుమ కన్నీళ్ల జీవనం సాగిస్తున్నారు.

మల్లాపూర్ విచారణలో చాలా మంది వలస కార్మికులు కాలానుగుణంగా ఉపాధిని కలిగి ఉన్నారు. పనులు లేనప్పుడు, వారు తమ కుటుంబాలను పోషించుకోవడానికి కష్టపడుతున్నారు.

"మల్లాపూర్‌లో నివసిస్తున్న ప్రజలు భారతదేశంలోని జార్ఖండ్ మరియు బీహార్ రాష్ట్రాల నుండి వలస వచ్చినట్లు" పునీత అన్నమ్మ గారి దేవాలయ ప్రజలతో HASSS వారి పరస్పర చర్చల ద్వారా తెలుసుకున్నారు.

"మహిళల బృంద చర్చల ద్వారా వలస కార్మికులు అసురక్షిత పని మరియు జీవన పరిస్థితులు వారిని వ్యాధులకు గురిచేస్తున్నాయని, పోషకాహార లోపించడం వల్ల  అంటువ్యాధుల బారిన పడుతున్నారు మరియు తాగుడుకి బానిస అయ్యారు" గురుశ్రీ మాదాను అంతోని, HASSS డైరెక్టర్ గారు తెలిపారు.

దురదృష్టవశాత్తు, ఈ కార్మికులలో చాలామందికి 'వలస కార్మికులు'గా తమ హక్కుల గురించి తెలియదు. వేతనాలు సైతం తక్కువగానే ఇస్తున్నారు. ఒక్క రోజు విధులకు హాజరు కాకపోయినా ఆ రోజు వేతనంలో కోత విధిస్తున్నారు.

వలస కార్మికుల దుర్భర పరిస్థితి గురించి తెలుసుకున్న ఫాదర్ గారు  పునీత అన్నమ్మ గారి దేవాలయాన్ని సందర్శించి, వలస వచ్చిన కుటుంబాలందరితో సంభాషించారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి, సమస్య తీవ్రతను బాగా అర్థం చేసుకోవడానికి ఆ ప్రాంతంలో పరిస్థితుల విశ్లేషణ అధ్యయనాన్ని ప్రారంభించారని, ఈ సందర్భంగా మూడు శిక్షణలను పొందిన వలస కుటుంబాలకు జీవనోపాధిగా కుట్టు మిషలను పంపిణీ చేశారని ఫాదర్ గారు తెలిపారు.

Add new comment

9 + 0 =