హైదరాబాద్ అగ్రపీఠంలో భారతీయ క్రైస్తవ దినోత్సవం

యేసుక్రీస్తు ప్రభువు వారి 12 మంది శిష్యులలో ఒకరైన అపొస్తులుడైన తోమా గారు భారతదేశనికి వచ్చి, క్రీస్తు రక్షణ సువార్తను అందించి, క్రీ॥శ॥ 72వ సం||రం, జూలై 3న హతసాక్షులయ్యారు. వారి జ్ఞాపకార్థం జూలై 3న భారతీయ క్రైస్తవ దినోత్సవంగా  హైదరాబాద్ అగ్రపీఠం, సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల నందు జరుపుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర చర్చిల సమాఖ్య (TSFC) సభ్యులు, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రెవ. డా. డేనియల్ గారు, తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య డిప్యూటీ సెక్రటరీ గురుశ్రీ . రాజు అలెక్స్ గారు  ఇతర సభ్యులతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సభ నిర్వహించడానికి తోడ్పడిన సెయింట్ మేరీస్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ గురుశ్రీ అల్లం ఆరోగ్యం రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

Add new comment

3 + 0 =