హిజ్రాలతో మినీ-క్రిస్మస్ వేడుకలను నిర్వహించిన HASSS

హైదరాబాద్‌ అగ్రపీఠం, సూరారం నందు హైదరాబాద్ ఆర్చిడయోసెస్ సోషల్ సర్వీస్ సొసైటీ (HASSS) వారు డిసెంబర్ 21, 2022న ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటి వారికి 'మేక్ థేయిర్ లైఫ్స్ బెటర్' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు 

హైదరాబాద్‌లోని 180 మంది హిజ్రాలతో కలిసి మినీ-క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం ద్వారా తన పనిని ప్రారంభించింది.

"కార్డినల్, హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య అంతోని పూల గారి మార్గదర్శకత్వం మరియు మార్గనిర్దేశక నిర్ణయాలతో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ వారికి  సమానత్వం మరియు గుర్తింపు కొరకు పోరాడడంలో తమ మద్దతు ఉంటుందని" HASSS ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గురుశ్రీ అంతోని మాదాను గారు తెలిపారు. 

భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ల జీవితాలను మెరుగుపరిచేందుకు వివిధ ప్రయత్నాలు చేసినప్పటికీ, సంఘ వివక్షత మరియు హింసను ఎదుర్కొంటూనే ఉంది

సుభాష్‌నగర్ కార్పొరేటర్ గుడిమెట్ల హేమలత, సురేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీతో ముచ్చటించారు. 

సూరారం విచారణ గురువులు గురుశ్రీ జోజి ఈ కార్యక్రమంలో చురుగ్గా  పాల్గొన్నారు. 

మధ్యాహ్న భోజనంతో కార్యక్రమం ముగిసింది, ఇది కేవలం ఒకసారి జరిగే కార్యక్రమం కాదని HASSS అభిప్రాయపడింది. 

రాబోయే రోజుల్లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి విద్య మరియు జీవనోపాధిపై HASSS  పెట్టుబడి పెట్టబోతోంది అని తెలిపారు 

Add new comment

2 + 10 =